అతి వేగం ప్రాణాలకు ప్రమాదం..ఇదిగో ఇదే సాక్ష్యం..

-

అతి వేగం ప్రాణాలకు ప్రమాదం..వేగం కన్నా ప్రాణం మిన్నా అని చాలా మంది చెబుతున్నా కొందరు వినరు..అంతా నా ఇష్టం అంటూ ఓవర్ స్పీడ్ వెళ్తున్నారు..మనుషులను మించి కోతులు కూడా రోడ్డును అతి వేగంగా దాటుతున్నాయి.. కొన్నిసార్లు ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. కోతుల అల్లరి ఏంటో తెలియంది కాదు..వానర చేష్టలంటేనే.. అందరికీ విసుగు తెప్పించేవిగా ఉంటాయి.ఎందుకంటే కోతులు చేసే తుంటరి పనులు అన్నీ ఇన్నీ కావు. ఇక విషయానికొస్తే..

తాజాగా ఓ కోతి చేసిన పని దాని ప్రాణంపైకి వచ్చింది. పాపం కోతికి కూడా ఏం తెలుసు, ఇక బైక్ నడిపేవాడికి కూడా ఏం తెలుసు పాపం? ఇలా అవుతుందని.. అతను తన వేగంతో వెళ్తుండగా, రోడ్డు దాటేందుకు ప్రయత్నించిన ఓ కోతి కూడా అదే వేగంతో రోడ్డు దాటేందుకు పరిగెత్తింది..రోడ్డు దాటుతున్న ఈ కోతి వేగంగా వస్తున్న బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. పాపం బయటకు రాలేక నరకయాతన అనుభవించింది. ఎట్టకేలకు స్థానికులు తీవ్రంగా శ్రమించి దాన్ని ఆ చక్రంలో నుంచి బయటకు తీసారు.

ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ బదోసరాయ్ ప్రాంతంలో జరిగింది. బైక్ వేగంగా వెళ్తోన్న సమయంలో ఓ కోతి సడెన్‌గా రోడ్డు దాటబోయింది. ఆ సమయంలో అనుకోకుండా ఆ కోతి బైక్ ముందు చక్రంలో ఇరుక్కుపోయింది. ఇది గమనించిన ఆ బైకర్.. వెంటనే బండిని ఆపేశాడు. కానీ, అప్పటికే ఆ కోతి.. బైక్ చక్రంలో ఇరుక్కుపోయింది.. ఈ కోతి చేసిన తుంటరి పనితో తృటిలో ప్రాణపాయం నుంచి తప్పించుకోగలిగింది.. కాస్త ఆలస్యం అయ్యింటే గోవిందా అనేది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.. అందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది..

Read more RELATED
Recommended to you

Latest news