తొందరగా బరువు తగ్గడానికి ఎలాంటి డైట్ పాటించాలో తెలుసుకోండి.

-

బరువు పెరగడం అనేది చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య. ఉండాల్సిన దానికన్నా ఎక్కువ బరువు ఉండడమనేది ఉన్న ఆరోగ్యాన్ని పాడుచేసుకోవడమే అవుతుంది. బరువు పెరగడానికి చాలా కారణాలుంటాయి. అందులో హార్మోన్ల ప్రభావం కూడా అయ్యుండవచ్చు. ఐతే బరువు తగ్గాలనుకే వారు తమ డైట్ ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

వ్యాయామం

పొద్దున్న లేవగానే యోగా గానీ, ఇంకేదైనా వర్కౌట్ చేయడం మర్చిపోవద్దు. యోగా లాంటివేమీ చేయకుండా కేవలం ఆహారం ద్వారానే బరువు తగ్గాలని అనుకోవద్దు. అలా తగ్గినా భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది.

రోజూ బరువు చూసుకోవద్దు

బరువు తగ్గాలనుకునే వారు రోజూ బరువు చూసుకోవడం చేస్తుంటారు. కానీ అది మంచి పద్దతి కాదు. అనవసరంగా భయాలు పెరిగే అవకాశం ఎక్కువ. భయం, టెన్షన్స్ మొదలైనవన్నీ కొందరిలో బరువు పెరగడానికి కారణమవుతాయి.

ఆపిల్

రోజూ ఒక అపిల్ తినండి. దానివల్ల బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

ఇంట్లోనే భోజనం

బరువు తగ్గాలనుకునే చేయాల్సిన ముఖ్యమైన పని ఇదే. బయట హోటళ్ళలో భోజనం చేయకుండా ఇంట్లోనే భోజనం చేయాలి. బయట తినాల్సిన సందర్భం వస్తే, ఇంటి నుండి బాక్స్ తీసుకెళ్ళండి.

నీళ్ళు

శరీరానికి కావాల్సినన్ని నీళ్ళు తాగండి. నీళ్ళు తాగడం వల్ల శరీరంలో జరిగే చర్యలు ఆరోగ్యాన్ని అందిస్తాయి.

నెమ్మదిగా తినండి

తొందర తొందరగా తినవద్దు. నెమ్మదిగా ఆహారాన్ని బాగా నమిలి మాత్రమే తినాలి. తొందరగా ముగించేయడం అంత మంచిది కాదు.

ప్రోటీన్ ని ఆహారంగా తినండి

గుడ్లు మొదలగు వాటిలో ప్రోటీన్ శాతం ఎక్కువగా ఉంటుంది. ప్రోటీన్లు కలిగిన ఆహారాలు కొవ్వును కరిగిస్తాయి. అందుకే ప్రోటీన్లని తినండి.

Read more RELATED
Recommended to you

Latest news