చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం వెనుక ఉన్న కారణాలు ఏంటి..?

-

చిన్నపిల్లలకు పుట్టెంటుకలు తీయడం మన సంప్రదాయం. ఏ ఆలయంలో..ఏ దేవుడి దగ్గర తీయాలో కూడా ముందే మొక్కుకుంటారు.. అసలు చిన్నపిల్లకు పుట్టెంటుకలు ఎందుకు తీస్తారు.. అలాగే ఉంచితే ఏం అవుతుంది.. 6 నెలలు లేదా ఏడాది లేదా వారి మొక్కులకు అనుగుణంగా తమ పిల్లలకు పుట్టెంటుకలు చేస్తారు. పుట్టెంటుకలు తీయడం వెనక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూ సాంప్రదాయం ప్రకారం పుట్టెంటుకలు తీస్తుంటారు. కానీ దీని వెనక శాస్త్రీయ కారణాలు ఉన్నాయట. తల్లి గర్భంలో శిశువు 9 నెలల పాటు ఉంటుంది. గర్భంలో శిశువు ఆ 9 నెలలు కూడా ఉమ్మనీరులో ఉంటుంది. ఆ ఉమ్మ నీరులో ఉన్న సూక్ష్మజీవులు, బాక్టీరియా శిశువు శరీరంపై చేరుతాయి. అయితే శిశువు పుట్టినప్పుడు అతని శరీరంపై కూడా కొంత బాక్టీరియా ఉంటుంది.

ఇక స్నానం చేయించినప్పుడు శరీరంపై, తల భాగంలో ఉన్న క్రిములు పోయినప్పటికీ కూడా తల భాగంలో క్రిములు అలాగే ఉండిపోతాయి. ఈ బాక్టీరియా కారణంగా చిన్న పిల్లలు అనారోగ్యం బారిన పడుతుంటారు. ఈ కారణంగానే చిన్న పిల్లలకు పుట్టెంటుకలు తీస్తుంటారు. అంతేకాదు చిన్న పిల్లల మాడు గట్టిపడడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి పుట్టిన కొన్ని నెలలకు పుట్టెంటుకలు తీస్తారు.

ఇక గుండు చేయించడం వల్ల పిల్లల మాడుకు నేరుగా సూర్యరశ్మి తాకడంతో పిల్లల ఎదుగుదల..డి విటమిన్ పుష్టిగా అందుతాయి. ఇక నెత్తి తీయించడం వల్ల పిల్లల మాడు గట్టిపడుతుంది. అలాగే సూర్యరశ్మి వల్ల రక్తప్రసరణ కూడా బాగా జరుగుతుంది. చాలా మందికి ఈ విషయాలు ఏం తెలియక.. మొక్కు కోసమే పుట్టెంటుకలు తీస్తున్నాం అనుకుంటారు. కానీ పిల్లలకు పుట్టెంటుకలు తీయడం వల్ల ఇలా అనేక రకాల లాభాలు జరుగుతాయి. కొన్నిసార్లు ఇలా తెలియకపోవడం వల్ల నష్టాలు కూడా ఉన్నాయి.. ఎలా అంటే.. ఈ పుట్టెంటుకలు తీసేది వాస్తవానికి చిన్నపని..కానీ మనం ఏంట్రా అంటే దాన్నో పెద్ద ఫంక్షన్‌ చేస్తాం.. బంధువులను పిలవడం, భోజనాలు పెట్టడం ఇలా.. వీటి కోసం డబ్బు లేకున్నా.. మీ దగ్గర టైమ్‌ దొరక్కపోయినా.. ఈ పనిని పోస్ట్‌పోన్‌ చేసుకుంటారు. కేవలం మొక్కే కదా.. తీరుద్దాంలే అని..కానీ దాని వెనుక ఉన్న ఈ కారణాలు మాత్రం ఎవరికీ తెలియదు..

Read more RELATED
Recommended to you

Latest news