ట్యాక్స్‌ సేవ్‌ చేయాలంటే నిపుణులు ఇస్తున్న సలహా ఏంటి..? పాతపన్ను విధానం బెటరేనా..?

-

మన సంపాదన పెరిగే కొద్ది..కట్టాల్సిన పన్ను కూడా పెరుగుతుంది.. కానీ పుణ్యానికి పైసలు రావు కదా..! ఎవరికీ ఎక్కువగా పన్నులు కట్టడం అంటే ఇష్టం ఉండదు. ఎలాగోలా పన్ను తగ్గించుకోవాలని చూస్తారు. ట్యాక్స్‌ సేవ్ చేయాలి అనుకుంటారు.. మరి ట్యాక్స్‌ సేవ్‌ చేయాలంటే ఏం చేయాలి..? దీనిపై నిపుణులు ఏం అంటున్నారు.. అసలే ఇప్పుడు పన్ను కట్టేవిధానంలో మార్పులు వచ్చాయి.. ఓల్డ్‌, న్యూ అని రెండు స్లాట్స్‌ అందుబాటులో ఉన్నాయి.. ఇందులో ఏది తీసుకుంటే మంచిది..? మనకు దేనివల్ల పన్ను తగ్గుతుంది..?

incometax

ప్రజలపై పన్ను భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం ఏటా కొత్త మార్పులను తీసుకొస్తుంది. ఇందులో భాగంగా గత నెలలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త పన్ను విధానం కింద సంవత్సరానికి రూ.7 లక్షల వరకు సంపాదించే వ్యక్తులకు ట్యాక్స్‌ ఎగ్జమ్షన్‌ ప్రకటించారు. ఈ కొత్త నిబంధన ఏప్రిల్ ఒకటి నుంచి అమల్లోకి రానుంది. అంటే వచ్చే నెల నుంచి పన్ను చెల్లింపుదారులు తమ పన్నులపై రూ.33,800 ఆదా చేసుకోగలుగుతారు. అయితే పాత పన్ను విధానం ఉపయోగిస్తేనే ఎక్కువ మొత్తంలో పన్నులను ఆదా చేసుకోవచ్చని ట్యాక్స్ నిపుణులు అంటున్నారు.

పాత పన్నుతో వారికి ఎక్కువ లాభాలు..

పాత పన్ను విధానంలో వేతన జీవులు రూ.50,000 స్టాండర్డ్ డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.
కుటుంబ పెన్షనర్లు రూ.15,000 వరకు డిడక్షన్ క్లెయిమ్ చేయవచ్చు.
కొత్త పన్ను విధానంలో కూడా ఈ డిడక్షన్‌లు అనుమతించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. అయితే కొన్ని పెట్టుబడులు, ఖర్చులపై మినహాయింపులను అందించే పాత పన్ను విధానం, అద్దె చెల్లించే లేదా గృహ రుణం ఉన్న పన్ను చెల్లింపుదారులకు ఇప్పటికీ మరింత ప్రయోజనకరంగా ఉంటుంది.

పాత పన్ను విధానంతో ఇలా ట్యాక్స్ సేవ్!

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. పాత పన్ను విధానంలో ఆదాయపు పన్ను చట్టానికి లోబడి పన్ను మినహాయింపుల ప్రయోజనాన్ని పొందొచ్చు. PPF, ELSS, NSC, SCSS వంటి ట్యాక్స్ సేవింగ్ పథకాలలో పెట్టుబడి పెట్టడం ద్వారా కట్టాల్సిన పన్నును తగ్గించుకోవచ్చు. గృహ రుణం ఉంటే.. దానికి కడుతున్న వడ్డీ, అసలు మొత్తానికి పన్ను మినహాయింపులను పొందవచ్చు.

ఐటీ చట్టంలోని సెక్షన్ 80C అనేది పన్ను పరిధిలోకి వచ్చే ఆదాయం నుంచి అనేక మినహాయింపులు ఇస్తుంది.. ఈ మినహాయింపులలో PPF, ELSS, NSC, SCSS, జీవిత బీమా ప్రీమియంల వంటి పెట్టుబడులు ఉన్నాయి. ఎడ్యుకేషన్ లోన్‌లపై చెల్లించిన వడ్డీ, తిరిగి చెల్లించిన అసలు రెండింటికీ పన్ను మినహాయింపులను పొందవచ్చు.

నేషనల్ పెన్షన్ సిస్టమ్ వంటి పెన్షన్ ఫండ్‌కి డబ్బులు చెల్లించడం ద్వారా కంట్రిబ్యూషన్లు, మెచ్యూరిటీ రాబడిపై కూడా పన్ను ప్రయోజనాలను పొందవచ్చు. అలానే హెల్త్/మెడికల్ ఇన్సూరెన్స్ ప్రీమియంల పై పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఇంకా పాత పన్ను నిర్మాణాన్ని సరిదిద్దడం వల్ల మధ్యతరగతి వారు మరిన్ని డబ్బులు ఆదా చేసుకోగలుగుతారు.

Read more RELATED
Recommended to you

Latest news