వాట్సాప్ కి ప్రత్యామ్నాయాలేమున్నాయి?

-

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండేవారికి ఇప్పుడన్నీ సందేహాలే. వాట్సాప్‌ వాడాలా వద్దా? వాడితే ఎలాంటి ప్రమాదం ఉంటుంది? ఇప్పటికే మన డేటాని వాట్సాప్‌ స్టోర్‌ చేసేసిందా? ఇలాంటి అనేక సందేహాలు అందర్నీ తొలిచేస్తున్నాయి. ఈ పరిస్థితులో ఇన్నిరోజులు రెగ్యులర్ గా వాడుతున్న వాట్సాప్ ని చూస్తే ఏదో హ్యాండిచ్చినట్టుగా ఫీలవుతున్నారు. వాట్సాప్‌ ఒక్కటేనా.. దాని తాతలాంటి యాప్‌ లు ఉన్నాయి. ఏదో అలవాటై వాడేస్తున్నాం అంతే. ఓ సిగ్నలుంది, టెలిగ్రాం ఉంది.. బోటిమ్‌ లాంటి యాప్‌ కూడా ఉంది. ఇవన్నీ, వాట్సాప్‌ కంటే సేఫ్‌ గా ఉంటాయి. యూజర్‌ డేటాను సేకరించవు. అలాంటి యాప్‌ లకు మళ్లటం తప్ప మరో మార్గం లేదా…

అప్పట్లో బ్రిటిష్ వాడు టీ అలవాటు చేసి దానికి బానిసలుగా మార్చేశాడు. వ్యాపారం పేరుతో మనల్నే ఆక్రమించేశాడు. ఇప్పుడు జుకర్ బర్గ్ అదే విధంగా ఫేస్‌బుక్‌, వాట్సాప్ ని అలవాటు చేశాడు. బానిసలుగా మార్చేశాడు. చివరకు మన సమాచారాన్ని మొత్తం అమ్మేస్తున్నాడు. నిజానికి ప్రైవసీ పాలసీకి ఎగ్రీ అనే ఆప్షన్ ఉండటం ఓ పెద్ద డ్రామా అనే చెప్పాలి. ఆల్ రెడీ డేటా మొత్తం ఫేస్ బుక్ వాడి దగ్గరుంది. ఇందులో సందేహం లేదు. ఇప్పుడు ప్రైవసీ పాలసీ అప్‌ డేట్‌ చేశాం… ఒప్పుకోండి అనడగటం… కేవలం భవిష్యత్తులో లీగల్ ఇష్యూస్ రాకుండా జాగ్రత్త పడటం మాత్రమే. ఇతంతా ఫార్మ ల్, లీగల్ యాక్సెప్టెన్స్ మాత్రమే. రేపు తమనెవరూ నిలదీయకుండా ఇప్పుడు జాగ్రత్త పడటం మాత్రమే.

దాదాపు పదేళ్ల క్రితం వచ్చిన వాట్సాప్ లేకుండా ఇప్పుడు ప్రపంచం నడవని పరిస్థితి ఏర్పడింది. ప్రత్యామ్నాయ యాప్‌ లు చాలా ఉన్నా, వాట్సాప్ లో ఉన్న యూజర్ ఫ్రెండ్లీ ఆప్షన్స్, నిరంతర అప్ డేట్లు దాని పాపులారిటీని పెంచాయి. అందుకే ప్రపంచమంతా ఇంటర్నెట్ చుట్టూ తిరుగుతుంటే అందులో వాట్సాప్ లాంటి ఇన్ స్టంట్ మెసెంజర్స్ మరీ ముఖ్యంగా మారాయి. మొన్న న్యూ ఇయర్ నాడు ఏకంగా 140 కోట్ల వాయిస్, వీడియో కాల్స్ చేశారంటే వాట్సాప్ ని ఏ రేంజ్ లో వాడుతున్నారో అర్థం చేసుకోవచ్చు. గతేడాది కంటే ఈ న్యూఇయర్ కాల్స్ 50 శాతం పెరిగాయని వాట్సాప్ ప్రకటించింది.

వాట్సాప్ డిలీట్ కొట్టేయటమే మార్గమా.. లేదంటే అప్ డేట్ కి ఓకె చెప్పి వాట్సాప్ తో కంటిన్యూ అయిపోతే ఎలా ఉంటుంది..? ఇలా అనేక ఆలోచనలు సోషల్ మీడియా యూజర్లలో ఉన్నాయి. అదే సమయంలో అనేకమంది వాట్సాప్ ని వదిలేయటానికి డిసైడ్ అయిన వాళ్లు కూడా ఉన్నారు. సిగ్నల్ లాంటి యాప్ ల వైపు చూస్తున్న వారు, ఆల్రెడీ వాటిని డౌన్ లోడ్ చేసుకుని వాడేస్తున్నవాళ్లు కూడా ఉన్నారు. ఇప్పటికే అనేక గ్రూపులు సిగ్నల్ , టెలిగ్రామ్ యాప్ లకు షిప్ట్ అయిపోయాయి.

చాలా తక్కువ వ్యవధిలోనే టెలిగ్రామ్ యాప్ను కొన్ని మిలియన్ల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అయితే కొందరు మాత్రం టెలిగ్రామ్ యాప్ మాత్రం సేఫేనా ? ఇంతకీ ఆ యాప్ దేశానిది? ఇది చైనా యాపా? అనే సందేహాలు వ్యక్తి చేస్తున్నారు. టెలిగ్రాం యాప్ను రష్యాకు చెందిన నికోలాయ్, పవెల్ డురోవ్ అనే ఇద్దరు సోదరులు డెవలప్ చేశారు. 2013లో ఈ యాప్ ను తొలుత ఐఓఎస్ ప్లాట్ఫాంపై అందుబాటులో ఉంచారు. తరువాత ఏడాదికి ఆండ్రాయిడ్ ప్లాట్ఫాంపై ఈ యాప్ అందుబాటులోకి వచ్చింది. టెలిగ్రాం యాప్ వాట్సాప్ కన్నా ఎంతో సురక్షితం. వాట్సాప్లోలాగే ఇందులోనూ ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ లభిస్తుంది. ఇందులో ఉండే సీక్రెట్ చాట్ ఫీచర్ సహాయంతో చాట్ చేస్తే ఆ సంభాషణలు టెలిగ్రాం సర్వర్లలో స్టోర్ కావు.

మరోపక్క వాడకంలో అచ్చం వాట్సాప్ను పోలి ఉండే సిగ్నల్ మరో బెస్ట్ యాప్ గా నిలుస్తోంది. సే హెలో టు ప్రైవసీ అనే టాగ్లైన్తో ఉండే సిగ్నల్ యూజర్ల డేటా ప్రైవసీకి చాలా ప్రాధాన్యత ఇస్తుందని భావిస్తున్నారు. మామూలు మొబైల్ కాల్ తరహాలో సిగ్నల్ యాప్లో వాయిస్ కాల్ ఫుల్ క్లారిటీ ఉండడం కూడా అదనపు ప్రధాన ఆకర్షణ. ఐపీ అడ్రస్ కూడా ఎవరికీ తెలియకూడదని భావించినప్పడు రిలే కాల్స్ ఫీచర్ను వాడుకోవచ్చు. అంటే సిగ్నల్ యాప్ సర్వర్ల ద్వారా కాల్స్ వెళతాయి. ఈ ఆప్షన్ ఉపయోగించినప్పుడు వాయిస్ క్వాలిటీ కొంత తగ్గుతుంది. ఇక సిగ్నల్ యాప్లో వీడియో కాల్ సౌకర్యం కూడా ఉంది. సిగ్నల్ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్, విండోస్, మాక్, లైనెక్స్ తదితర ఆపరేటింగ్ సిస్టమ్లలో పనిచేస్తుంది. గ్రూప్స్ కూడా పెట్టుకోవచ్చు. గ్రూప్ వీడియో కాలింగ్ సౌకర్యాన్ని కూడా ఇటీవలే జోడించింది. మెసేజ్కు ఎమోజీ ద్వారా రిప్లై ఇవ్వడం, డిలీట్ ఫర్ ఎవ్రీవన్, డిసప్పియరింగ్ మెసేజ్ ఫీచర్లు కూడా దీనిలో ఉన్నాయి.

ఓవరాల్ గా వాట్సాప్ అత్యాశ చివరికి దాన్నే ముంచేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news