పెళ్లైన తర్వాత లైఫ్ చాలా మారిపోతుంది. ఏది మునపటిలా ఉండదు. చుట్టు కొత్త సమాజం ఉంటుంది. మీ వాళ్లు అనేవాళ్లు ఎక్కడో దూరంగా ఉంటారు. లవ్ మ్యారేజ్ అయితే ఆ భయం పెద్దగా ఉండదు. కానీ అరేంజ్ మ్యారేజ్‌లో కొత్తి ఇంట్లో అడ్జెస్ట్ అవ్వాలంటే.. చాలా టైమ్ పడుతుంది. ఇదే క్రమంలో లేడీస్ బరువు కూడా పెరుగుతారు. అసలు పెళ్లయ్యాక అమ్మాయిలు ఎందుకు లావు అవుతారు. దీనికి కారణాలు ఏంటో చూద్దాం.!
బరువు పెరగడం అనేది జన్యుశాస్త్రంతో పాటు జీవనశైలిలో కలిగే మార్పుల వల్ల జరుగుతుంది. అలాగే హార్మోన్ల మార్పులు వంటి అనేక కారణాలే అంటున్నారు నిపుణులు. చాలా మంది అమ్మాయిలు పెళ్లికి ముందు తమ బరువు గురించి చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. బరువు పెరగకుండా తమ శరీరంపై శ్రద్ద పెడతారు. కాని పెళ్లి తర్వాత ఆ శ్రద్ధ కాస్త తగ్గుతుంది. జీవిత భాగస్వామి దొరికిన తర్వాత చాలా మంది తమ లుక్స్ గురించి పెద్దగా ఆలోచించరు.
కొత్త వాతావరణంలో నిద్రపోవడం చాలా మందికి ఇబ్బందిగా ఉంటుంది. సక్రమంగా నిద్రపోకపోవడం వల్ల బరువు పెరుగుతారు. ఇది కొందరిలో బరువు పెరగడానికి కారణమవుతుంది. పెళ్లయిన తర్వాత రెగ్యులర్ గా శారీరక కలయిక(శృంగారం) చేయడం వల్ల ఈస్ట్రోజెన్ హార్మోన్ పెరుగుతుంది. ఈ హార్మోన్ ఆహారం నుంచి కొవ్వును గ్రహించిన తర్వాత శరీరంలో పేరుకుపోతుంది, దీని కారణంగా వివాహిత అమ్మాయి సులభంగా లావు అవుతుంది.
అయితే రెగ్యులర్ శృంగారంతోనే లావుగా మారే అమ్మాయిల వెనుక ఎలాంటి ఫిజియోలాజికల్ రీజన్ లేదని నిపుణులు అంటున్నారు. దంపతులు శృంగారం చేసుకున్న తర్వాత అతని 2-3 మిమీ స్పెర్మ్ 15 కేలరీలను మాత్రమే ఇస్తుంది. పెళ్లి తర్వాత భాద్యతలు పెరుగుతాయి. ఫలితంగా ఆందోళన కొంతమేర పెరుగుతుంది. ఇది బరువు పెరగడానికి కూడా దారి తీస్తుంది. కొత్త కోడలని కాస్త ఎక్కువగా ఆహారం పెట్టడం, అవి ఇవీ అని తేడాలేకుండా అన్నీ ఎడాపెడా వండి పెడుతుంటారు.