సడెన్ గా ట్రైన్ బ్రేక్ ని ఎందుకు వేయరు..? దాని వెనుక ఉన్న కారణం ఇదే..!

-

ట్రైన్ కి అడ్డంగా మనుషులు వచ్చారని జంతువులు వచ్చారని ప్రాణాలను కోల్పోయారని వార్తలో మనకి కనబడుతూ ఉంటాయి. పైగా ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వాళ్ళు కూడా రైలు పట్టాల వద్దకు వెళ్తారు. వాహనానికి ఎదురు వుండే వ్యక్తి రైలు నడిపే అతనికి ముందే కనపడతారు బ్రేక్ వేసి వాళ్ళని కాపాడొచ్చు. కానీ సడన్ గా బ్రేక్ వేయరు. దాని వెనుక కారణాలు ఏమిటి..? రైలు బ్రేకు వెంటనే ఎందుకు వేయరు..? సడన్ గా బ్రేక్ వేస్తే ఏమవుతుంది అనే విషయాన్ని తెలుసుకుందాం.

మామూలుగా మనం బండి, బస్సు, కారు వంటి వాటికి ఈజీగా బ్రేక్ వేసి ఆపొచ్చు. కానీ వాహనం రైలు బోగి లో సగం కూడా ఉండదు. కొన్ని బోగీలు కలిపితే రైలు అవుతుంది. ఒకవేళ కనుక సడన్ గా బ్రేక్ వేస్తే వేలాది మంది ప్రాణాలు కోల్పోవచ్చు. ఎదురుగా ఉన్న ఒక ప్రాణం కోసం రైలులో వందలాది ప్రాణాలని రిస్క్ చేయడం కుదరదు. ఇంజన్ వేగం తగ్గితే మిగతా బోగీలు అదే దిశలో వేగంగా కదిలి ఒక దాని మీద ఒకటి ఎక్కే అవకాశం ఉంటుంది.

ట్రైన్ లో ఉండే బ్రేక్ సిస్టం వాక్యూమ్ ప్రెషర్ తో నిండి ఉండి అన్ని బోగీలని ఒక ట్యూబ్ ద్వారా కలిపి ఉంచుతారు. లోపల పీడనం తగ్గిస్తే బ్రేక్ ఉపయోగం లోకి వస్తుంది. ఒక్కసారిగా స్పీడ్ తగ్గించకూడదు. కొంచెం కొంచెంగా తగ్గించాలి. లేకపోతే అందరికీ రిస్కే. భోగిలు కూడా పట్టాలు తప్పే అవకాశం కూడా ఉంది. ట్రైన్ బ్రేకింగ్ డిస్టెన్స్ పొడవు పరిణామం అది ఏ స్పీడ్ లో వెళ్తోంది వీటి ఆధారంగా నిర్ణయిస్తారు. కొన్నిసార్లు 500 మీటర్ల నుండి కిలోమీటర్ దాకా కూడా ఆ రైలు ఆగడానికి అవ్వదు.

Read more RELATED
Recommended to you

Latest news