క్యాట్‌ వాక్‌ చేసేప్పుడు మోడల్స్‌ ఎందుకు సీరియస్‌గా ఉంటారు.. నవ్వితే ఏమైతుందో

-

ఎప్పుడు నవ్వుతూ ఉండే వాళ్లు.. అందంగా కనిపిస్తారు అని అంటారు. మరి అందాల పోటీల్లో మాత్రం ఎవరూ నవ్వరు.. వాళ్ల ఆస్తి ఏదో మనం రాయించేసుకున్నట్లు.. ముఖం అంతా సీరియస్‌గా పెట్టుకోని ర్యాంప్‌ వాక్‌ చేస్తూ వస్తారు. మీరు చూసే ఉంటారు కదా.. క్యాట్‌ వాక్‌ చేస్తూ స్టైల్‌గా నడుకుచుకుంటూ వస్తారు కానీ.. ముఖం మీద అస్సలు నవ్వు ఉండదు..ఒక్కరు ఇద్దరు అంటే.. వాళ్ల ప్రాబ్లమ్‌ అనుకోవచ్చు.. కానీ అందరూ ఇలానే చేస్తారు.. ఎందుకు అలా..? దీని వెనుక ఏదైనా స్పెసిఫిక్‌ రీజన్ ఉందా..? పూర్వకాలంలో రాజకుటుంబాల స్త్రీల ఫోటోలు మీరు ఎప్పుడైనా చూసినట్లయితే వాళ్లు సీరియస్‌గా కనిపిస్తారు.. 19వ శతాబ్దంలో కోపంగా, గంభీరంగా ఉండటాన్ని ఉన్నత హోదా, సంపదకు చిహ్నంగా పరిగణించేవాళ్లు.. నేటికీ ఈ నమ్మకాన్ని చాలా మంది అనుసరిస్తూ ఉంటారు. ఖరీదైన బట్టలు ధరించి ర్యాంప్‌పై నడిచే మోడల్స్ ఎప్పుడూ నవ్వరు. నవ్వకుండా, మోడల్స్ ప్రేక్షకుల ముందుకు వస్తారు.

నవ్వకపోవడం ఒక వ్యక్తి తన భావోద్వేగాలు తనపై ఆధిపత్యం చెలాయించకుండా కంట్రోల్‌ చేసుకోవడమే.. మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు.. నవ్వితే ఆ పనిమీద సీరియస్‌ నెస్‌ను కోల్పోతాం..మాములుగానే క్యాట్‌ వాక్‌ చేసే వాళ్లు వెరైటీ దుస్తులు వేసుకుంటారు. వాళ్లను ప్రేక్షకులు విచిత్రంగా, ఆశ్యర్యంగా చూస్తారు. అప్పుడు ఆ మోడల్‌ కూడా నవ్వారంటే..ఆమె తమ మీద విశ్వాసాన్ని కోల్పోతుంది. అందుకే గంభీరంగా ముఖం పెట్టాలి. మోడల్ నవ్వకపోతే ఎవరూ నవ్వలేరు.

ఇంకో లాజిక్‌ ఏంటంటే.. మోడల్స్‌ వాళ్లు ధరించిన బట్టలను చూపించడమే ముఖ్య ఉద్దేశం.. అందుకే వాళ్లు మార్కెట్‌లో దొరకనవి వింతంగా ఉండేవి వేసుకుంటారు. ఒకవేళ వాళ్లు నవ్వారంటే.. ప్రేక్షకులు దృష్టి.. వాళ్ల ముఖం మీద పోతుంది.. బట్టలను ఫోకస్‌ చేయరు. గంభీరంగా ఉంటేనే అందరిని ఆకర్షిస్తారని చాలా మంది నమ్ముతారు. ఏదైనా ఉత్పత్తులను పరిచయం చేసేప్పుడు.. మోడల్స్ నవ్వకూడదని ట్రైనర్స్ చెప్తారు.. అందుకే యాడ్స్‌లో కూడా ఇదే రూల్‌ పాటిస్తారు. ఒకవేళ యాడ్‌ ఇచ్చే వాళ్లు నవ్వితే.. మనం వాళ్లు చూపెట్టె ప్రొడెక్ట్‌ గురించి మానేసి..వాళ్లను చూస్తాం..సో.. ఇంత కథ ఉంటుందన మాట..!

Read more RELATED
Recommended to you

Latest news