ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య మున్సిపల్ కార్పోరేషన్ ఆసక్తికర నిర్ణయం తీసుకుంది. అయోధ్య మునిసిపల్ అధికారులు పట్టణంలోని ఆవులను చలి నుంచి కాపాడేందుకు వాటికి చలికోట్లు కుట్టిస్తున్నారు. అయోధ్య నగర్ నిగమ్ కమిషనర్ నీరజ్ శుక్లా మాట్లాడుతూ.. ‘ఆవుల కోసం చలికోట్లు తయారుచేయిస్తున్నాం. ఎద్దులకు ఒక పొర, ఆవులకు రెండు పొరలతో కోట్లు తయారువుతున్నాయి. దూడలకు కూడా వీటిని తొడగనున్నారు. వీటికి మూడు పొరలు ఉన్నాయి.
లోపలి పొర మొత్తగా ఉంటుంది. ఒక్కో కోటుకు రూ. 250 నుంచి రూ. 300 ఖర్చు చేస్తున్నారు. ‘ఈ పథకాన్ని మూడు నాలుగు దశల్లో అమలు చేస్తామని తెలిపారు. అలాగే చలికి తట్టుకునే విధంగా కోట్లు ఇవ్వడంతో పాటు షెడ్ లను కూడా పునర్మించనున్నట్లు వెల్లడించారు. అదే విధంగా ఇక్కడి గోశాలలో 700 ఎద్దులతో సహా మొత్తం 1200 పశువులు ఉన్నాయి. వీటిలో మొదట 100 ఆవులు,దూడలకు చలికోట్లు ఇప్పటికే ఆర్డర్ ఇచ్చామన్నారు.