రజస్వల తర్వాత నుంచి మెనోపాజ్ వరకు ప్రతి నెల కూడా ఆడ వాళ్ళకి పీరియడ్స్ వస్తూ ఉంటాయి. పీరియడ్స్ సమయంలో బ్లీడింగ్ అవుతుంది. ఈ రక్తాన్ని కొందరు చెడు రక్తంగా కూడా భావిస్తారు. ఈ రక్తం దుర్వాసనతో ఉంటుంది. అందుకని ఎవరూ దీనిని తాకడానికి కూడా ఇష్టపడరు. కానీ ఈమె మాత్రం ఏకంగా డ్రింకు, కాఫీ తాగినట్లు తాగేస్తోంది. అదేంటి పీరియడ్స్ రక్తాన్ని తాగుతోందా..? ఎందుకు ఆమె పీరియడ్స్ రక్తం తాగుతోంది అనే దాని గురించి చూస్తే…
ఈమె పీరియడ్స్ బ్లడ్ ని చాలా రోజుల నుంచి తీసుకున్నట్లు తెలుస్తోంది. పైగా స్వయంగా ఆమె ఈ విషయాన్ని చెప్పారు. దీన్ని తీసుకోవడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆమె వివరిస్తున్నారు. స్పెయిన్ కి చెందిన జాస్మిన్ అలీసియా కార్టర్ 30 ఏళ్ళ వయసున్న మహిళ. ఈమెకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే ఈమె హోటల్ లో వెయిట్రెస్ గా పని చేస్తున్నారు.
పీరియడ్స్ సమస్యకు సంబంధించిన సలహాలను అందరికీ చెప్తూ ఉంటారు. తాజాగా ఈమె పీరియడ్ బ్లడ్ ని తీసుకుంటే మంచిది అని చెప్పింది. అలానే ఈమె దానిని తాగుతోంది కూడా. దీన్ని చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఈమె మనిషా రాక్షసా అని కూడా తిట్టిపోస్తున్నారు. కేవలం తాగడం మాత్రమే కాకుండా ఈమె ఆ బ్లడ్ తో ఫేస్ ప్యాక్ కూడా వేసుకున్నారు. చూసిన నెటిజన్లు అందరూ కూడా అవాక్కవుతున్నారు.