గతంలో ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన కారుగా రోల్స్ రాయల్‌కు చెందిన రాయ్స్ స్వెప్టెయిల్ రికార్డుకెక్కగా, ఇప్పుడు బుగాటి లా వయొచుర్ నొయిర్ కారు ఆ కారు స్థానాన్ని బీట్ చేసి టాప్ ప్లేసులో నిలిచింది.
కారు కొనుక్కోవడం అనేది చాలా మంది కల. ఆ కలను నిజం చేసుకునేందుకు చాలా మంది యత్నిస్తుంటారు. ఈ క్రమంలోనే తాహతు ఉన్నవారు తమ ఆర్థిక స్థోమతకు అనుగుణంగా కార్లను కొనుగోలు చేస్తుంటారు. ఇక ధనికులు అయితే కోట్ల రూపాయల విలువైన కార్లను కొంటారు. అయితే ఇప్పుడు మేం చెప్పబోయే ఓ కారును మాత్రం మామూలు ధనికులు కొనలేరు. ఎందుకంటే దాని ధర అంత ఉంటుంది మరి.. అయితే మరి ఆ కారు ఏమిటో.. దాని ధర ఎంతో.. ఇప్పుడు తెలుసుకుందామా..!
ఫ్రాన్స్‌కు చెందిన ప్రముఖ కార్ల తయారీ కంపెనీ బుగాటి.. లా వయొచుర్ నొయిర్ పేరిట ఓ లగ్జరీ కారును ఇటీవలే స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగిన మోటార్ షోలో ప్రదర్శించింది. అయితే ఆశ్చర్యంగా ఆ షోలో కారును ఉంచకముందే దాన్ని ఎవరో ఓ ధనికుడు కొనుగోలు చేశాడట. ఇక ఆ కారు ధర అక్షరాలా రూ.133 కోట్లు. అవును, మీరు విన్నది నిజమే. అయితే కారు ధర రూ.87.6 కోట్లేనట. కానీ కారును కొన్నాక ట్యాక్సులకే రూ.45 కోట్లు చెల్లించాలట.
ఇక లా వయొచుర్ నొయిర్ కారు ఫీచర్ల విషయానికి వస్తే.. అందులో ఇంజన్‌కు 1500 హార్స్ పవర్ సామర్థ్యం ఉంది. 16 సిలిండర్లు ఇంజిన్‌లో ఉంటాయి. ఈ కారులో 100 కిలోమీటర్లు వెళ్లేందుకు 35.2 లీటర్ల ఇంధనం అవసరం అవుతుంది. ఈ కారు గంటకు గరిష్టంగా 420 కిలోమీటర్ల వేగంతో వెళ్లగలదు. 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ చేరుకునేందుకు కేవలం 2.4 సెకన్ల సమయం మాత్రమే పడుతుంది. ఈ కారుకు 7 గేర్లను, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ను ఇచ్చారు. కాగా గతంలో ప్రపంచంలోనే అత్యధిక ధర కలిగిన కారుగా రోల్స్ రాయల్‌కు చెందిన రాయ్స్ స్వెప్టెయిల్ రికార్డుకెక్కగా, ఇప్పుడు బుగాటి లా వయొచుర్ నొయిర్ కారు ఆ కారు స్థానాన్ని బీట్ చేసి టాప్ ప్లేసులో నిలిచింది..!