చిన్నప్పటినుండి మనం పెట్టుకునే లక్ష్యాలు చాలా చిన్నవి. చదువులో గొప్ప ర్యాంకులు, ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగం, అర్ధం చేసుకునే లైఫ్ పార్ట్ నర్, పిల్లలు, సంసారం, సెలవుల్లో సినిమాలూ, సరదాలూ, మళ్లీ పిల్లల సెటిల్‌మెంట్, వారి పెళ్లిళ్లు, వృద్ధాప్యం, సాఫీగా సాగిపోతే చాలుననే భరోసా ఇవి ఉంటే చాలు జీవితం నెట్టుకురావడానికి! అంతకన్నా ఏ ఆలోచనా మనకు తట్టదు.
ప్రతీ క్షణం మనకు సామాజిక, ఆర్ధిక భద్రత ఉంటే చాలు. ఆ భద్రత సాధించడానికే మన జీవితం సృష్టించబడింది అన్నట్లు ఆ కొద్దిపాటి లక్ష్యాల కోసమే అమూల్యమైన జీవితాన్ని త్యాగం చేస్తుంటాం.
ఈ ప్రపంచంలో ఓ అద్భుతమైన శక్తిగా నిలబెట్టుకోవడానికి ఇంకేమీ ఉన్నతమైన లక్ష్యాలు లేవా? డబ్బూ, సామాజిక హోదా జీవిత పరమావధులు కావు. అవి మనకు సౌఖ్యాలు అందిస్తాయంతే. ప్రతీ మనిషిలోనూ నిగూఢంగా ఎన్నో శక్తియుక్తులు కేంద్రీకృతమై ఉంటాయి. ఎక్కడా ఎవరూ వాటిని తట్టిలేపడానికి ప్రయత్నించరు. వారికి స్టీరియోఫోనిక్ జీవితాల బదులు, ఆదర్శవంతమైన జీవనవిధానాన్ని, సందేశాన్ని బోధించగలిగితే చాలు. ప్రతీ వ్యక్తిలోని అద్భుత శక్తియుక్తులు మనం కళ్లారా చూస్తాం