అసాధారణ స్థితి
అసాధారణం అనుకునే ప్రజ్ఞ
అసాధారణం అని అనుకునే ధారణ
ఇవన్నీ జీవితాలను ప్రభావితం చేస్తాయి
మార్పునకు అంగీకారం ఇస్తాయి
మండుటెండల్లో ఈ ఆదివారాలు ఏవో ఒక
జీవన నేపథ్యాలను పరిచయం చేస్తుంటాయి
వాటి వడపోత నిష్కామ క్రియ మరియు కాలం
వాటి సంగ్రహ వాక్యం జీవితం
వాక్యార్థం తేలాక వచానార్థం వెలుగు
వచానార్థం వెలిగాక వాక్యార్థం ఇకపై చరిత
పై వాడి రాత మార్చగలిగే శక్తి కూడా !
కావొచ్చు…
సంతృప్తి అనేది ఒక కొలమానం కాకుండా ఉంటే మేలు. స్వేద వేదాల చెల్లింపుల్లో సంతృప్తి ఎక్కడ ..? ఎండకు వానకు తడిసిన అలసిన దేహాలకు జీవితం ఏమిచ్చి సంతృప్తం చేస్తుంది. ప్రపంచం ఏమిచ్చి సంతృప్తం చేస్తుంది. సంతృప్తత అన్నది ఓ స్థానం.. స్థానాన్ని స్థిరం చేయడం ఓ ప్రయత్నం. అడ్డూ అదుపూ లేకుండా ఇతరుల మాటల పట్టింపు అన్నది లేకుండా చేసేందుకు ఇష్టపడే ప్రయత్న సంబంధ పనులన్నీ గొప్పవి. ఆ విధంగా మనిషి గొప్పవాడు. ఆ తరహా స్త్రీ, ఆ తరహా పురుషుడు మధ్య అభేదం గొప్పది.
వేర్వేరు అని చెప్పడంలో అర్థం లేదు. విషయ వివేచన ఒక్కటే ఉంది. వేర్వేరు కాదు అని చెప్పడంలో అన్వయం ఉంది. వేర్వేరు అని చెప్పకపోవడం కూడా కొన్ని సార్లు మేలు కూడా ! కనుక మనుషులకు కాలం చెప్పే ఊసులు బాగుంటాయి. అవి కలలకు సాకారం ఇస్తే ఇంకా బాగుంటాయి. కాలం చెప్పే ఊసులు ఈవిధంగానే ఉండాలి. ఉంటేనే మేలు. మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మనుషులు తమని తాము నిరూపించుకునే ప్రకియే ఎంతో గొప్పది. ఆ తరహా స్త్రీ ఆ తరహా పురుష అభేదం పాటించిన చాలు.. ఎంతో మేలు.
We are all normally abnormal
అని చదివేనొక చోట.
ఆ మాటకు కొనసాగింపు ఇస్తూ..
రాస్తున్నానొక సండే మేగజీన్ స్టోరీ.
చదవండిక.. మన లోకం పాఠకుల కోసం.
ఇతరుల కన్నా నువ్వు భిన్నం. ఇతరులు నీ కన్నా భిన్నం. విభిన్నతలకు ఆనవాలుగా నిలిచిన కాలం చెంత మనిషి ఒక నిక్షిప్త సందేశం. ఆ మాటలను వింటూ వింటూ మరికొన్ని పనులు చేయాలి. విస్తృత రీతిన చేసే పనులే గొప్పవి. అవి మంచి కి తార్కాణం అయి నిలవాలి. చెడు అన్నది ఉంటే ఉండనీ.. మోయాల్సిందే.. భరించాల్సిందే.. మనిషి కష్టంతో కొన్ని చెడ్డ కాలాలు దోబూచలాటలు ఆడుతాయి. మనిషి తనని తాను విస్తరించుకునే క్రమంలో ప్రపంచం నుంచి పొందే మంచి కన్నా ప్రపంచంతో పొందే వైరమే గొప్పది. అవును ! ఒప్పుకోకపోవడంలో ఆంతర్యం ఏంటంటే కాస్తయినా తార్కిక జ్ఞానం ఒకటి మనిషిలో ఉంది అని!
ఇప్పటివరకూ చేసింది చెడ్డ, చెప్పింది చెడ్డ, చెప్పాల్సింది చెడ్డ అని ఈ నాయకులు అంతా ఎలా చెప్పగలరు. చెప్పమనండి ఎంత బాగుంటుందో తాము చేసిన తప్పిదాల ఒప్పుకోలు గురించి చెప్పమనండి.. ఎండకూ వానకూ తూగని కొన్ని పనుల విస్తృతి గురించి చెప్పమనండి ఎంత అర్థవంతం అయి ఉంటుందో ! మనుషులు ఇప్పటి కన్నా ఎక్కువ మేలు కోరుకునే ప్రపంచానికి చేరు వ కావాలి అని అనుకుంటే ఎబానార్మాలిటీ అన్నది ఒకటి తప్పక కోరుకోవాలి. పొంది ఉండాలి కూడా ! ఆదివారాలు కాలక్షేపాలకు
సంకేతాలు అయితే ఏం చెప్పగలం.. నిరంతర సాధనకు ఒక ఆనవాలు ఆదివారం అయితే ఆ ప్రయోజన సంబంధం తప్పక
అబ్ నార్మల్.. అన్ యూజ్‌వల్ …
– రత్నకిశోర్ శంభుమహంతి
శ్రీకాకుళం దారుల నుంచి
అసాధారణం నాల్గక్షరాల వేదం