నాచురల్ స్టార్ నాని, సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నానని చెప్పారు. సినీ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో చాలా కష్టంగా ఉండేదని… పరిశ్రమలో అసలు ఏం జరుగుతుందనేది అర్థమయ్యేది కాదని తెలిపారు నాని. అతను ఇలా ఎన్నో సవాళ్లను, తిరస్కరణలను ఎదుర్కొన్నానని తెలియచేసారు. అయితే వేరే వాళ్లతో పోలిస్తే తాను మాత్రం కాస్త తక్కువ కష్టాలనే చూశానని చెప్పుకొచ్చారు నాని. అసిస్టెంట్ డైరెక్టర్ గా, అందులోనూ క్లాప్ అసిస్టెంట్ గా ఉంటే మాత్రం చాల అవమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలియచేసారు.
నీకు ఏదైనా చెప్పేయొచ్చని అందరూ అనుకుంటుంటారని వెల్లడించారు ఆయన. ఇష్టం వచ్చినట్టు తిడతారని, వారికి గట్టిగా సమాధానం ఇవ్వాలని ఉన్నా కూడా, మనం మాత్రం తిరిగి ఏమీ అనలేమని అన్నారు. క్లాప్ బోర్డ్ ఆలస్యమైనా కూడా, ఏదో ఒకటి మనల్నే అంటారని తెలిపారు. ఒక దర్శకుడు తనను అవమానించాడని, ఎప్పటికీ డైరెక్టర్ కాలేవని అన్నాడని… ఆ మాటలతో తాను ఎంతో మనోవేదన చెందానని తెలియచేసారు. తాను హీరో అయ్యాక ఆ దర్శకుడిని కలిశానని, కనీసం అప్పుడు కూడా తమ చుట్టూ ఉన్న వాతావరణం అంత బాగోలేదని తెలిపారు నాని. ఇండస్ట్రీలో తన కంటే కూడా ఎక్కువ కష్టాలు పడ్డవారు ఉన్నారని, వారు తనకు తెలుసని వ్యక్తపరిచారు నాని.