మీ అందరి ప్రార్థన వల్లే ఇలా ఉన్నాను: సమంత

-

హీరోయిన్ సమంత.. అభిమానుల ట్వీట్స్కు రిప్లై ఇస్తూ నెట్టింట సందడి చేసింది. ఓ అభిమాని.. ‘నేను ఎప్పటికీ మీ వీరాభిమానిని. నీ రక్షకునిగా.. నమ్మకస్తునిగా ఉంటాను. మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రేమిస్తున్నా. నా ప్రేమ ఎప్పటికీ నిలిచి ఉంటుంది సామ్’ అని ట్వీట్ చేసింది. దీనికి సమంత స్పందిస్తూ.. ‘ఎల్లప్పుడూ నాకు తోడుగా.. నా వెనుక ఉన్నందుకు ధన్యవాదాలు. మీ అందరి ప్రార్థన వల్లే నేను ఇలా ఉన్నాను’ అని రిప్లై ఇచ్చింది. ఓవైపు విడాకులతో ఒంటరి జీవితం, విమర్శలు, మరోవైపు మయోసైటిస్ జబ్బుతో పోరాటం… అయినప్పటికీ సమంత స్థైర్యం కోల్పోలేదు. దక్షిణాది సినిమాలే కాదు, బాలీవుడ్ లోనూ తన నటనా ప్రతిభను చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది సమంత. ఇప్పుడు జీవితం ఎలా ఉంది అని ఓ అభిమాని ప్రశ్నించగా, ఈ జీవితం మరోలా ఉందని సమంత సమాధానమిచ్చింది.

మీలాంటి అభిమానులే తన బలం అని, మీ ప్రేమాభినాలు తన వెన్నంటి నడిపిస్తున్నాయని మరో అభిమానికి రిప్లై ఇచ్చింది. నేనెవరో తెలియని ఓ అమ్మాయి కోసం రోజూ ప్రార్థిస్తున్నాను… దీనిపై మీరేమంటారు అని ఓ అభిమాని అడగ్గా… ఆ అమ్మాయికి నువ్వు అవసరం అని సామ్‌ బదులిచ్చింది. ఇక సమంత కొత్త చిత్రం శాకుంతలం సినిమా గురించి ఓ అభిమాని ప్రస్తావించాడు. 3డీలో రిలీజ్ చేసేంత ప్రత్యేకత శాకుంతలం చిత్రంలో ఉందా అని ప్రశ్నించాడు. మీరే చూస్తారుగా అంటూ సమంత వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news