కామారెడ్డిలో దారుణం.. పిడుగు పడి 11 మందికి గాయాలు

-

తెలంగాణాలో వరుస వర్షాల కారణంగా పిడుగు పాటుకు గురవుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షాలకు పదకొండు మంది మృతి చెందారు. కామారెడ్డి జిల్లా క్యాసంపల్లి తండా శివారులో శనివారం సాయంత్రం బూ క్యా బందర్, అతని భార్య బుల్యా, కొడుకు రాజేందర్, తండాకు చెందిన బూక్యా లక్ష్మి, బూక్యా హుస్సేన్, ఇస్లావత్‌ గం గులు పొలంలో పనులు చేస్తుండగా అకస్మాత్తుగా ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో వెంట నే వారంతా ఓ చెట్టుకిందకు వెళ్లారు. అదే సమయంలో వారికి సమీపంలో పిడుగు పడడంతో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో అందరూ అ పస్మారక స్థితికి చేరుకున్నారు. స్థానికులు వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

IMD forecasts thunderstorms in Hyderabad over next three days

నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. అలానే రాజన్నసిరిసిల్ల జిల్లాలో కూడా శనివారం సాయంత్రం కోనరావుపేట మండలం మామిడిపల్లిలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద ఈదురు గాలులతో కూడిన వర్షం రావడంతో ఆరబోసిన ధాన్యాన్ని తీసే ప్రయత్నంలో ఉండగా అదే సమయంలో వర్షం పడడంతో చెట్టుకింద తలదాచుకునేలోపే ఐదుగురు రైతులు పిడుగు పాటుకు గురికావడం జరిగింది. వారికి తీవ్ర గాయాలు కావడంతో వేములవాడలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడ్డ రైతులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మండల అధికారులకు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news