ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్నటువంటి శ్రీరాముని ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈరోజు వైభవంగా జరిగింది.ఈరోజు ఈ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. మధ్యాహ్నం 12:38 గంటలకు అభిజిత్ లగ్నంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ఠ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు అయినారు .అంతేకాకుండా దేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
ఈ కార్యక్రమానికి క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, జడేజా,అనిల్ కుంబ్లే, మిథాలీ రాజ్‌లు పాల్గొన్నారు. కానీ మహేంద్రసింగ్ ధోని, విరాట్ కోహ్లి,రోహిత్ శర్మలు ఈ కార్యక్రమానికి రాలేదు. దీంతో నెటిజన్లు ఈ ఆటగాళ్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాడ్ షూట్స్, పార్టీలు, పబ్బుల వెంట తిరగడానికి సమయం ఉంటుంది కానీ దేశం మొత్తం ఎన్ని రోజులు వేచి చూస్తున్నా అటువంటి ఈ మహోత్తర ఘట్టానికి రావడానికి మాత్రం తీరిక లేదా అంటూ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా పలువురు నెటిజన్లు స్పందిస్తూ… బహుశా తమిళనాడు అభిమానులు హర్ట్ అవుతారని ధోని రాలేదా..? సీఎస్కే కూడా దీనిపై ఒక్క ట్వీట్ వేయలేదు అని ‘షేమ్ ఆన్ యూ ధోని, విరాట్ కోహ్లీ,రోహిత్ ..’అని కామెంట్స్ చేస్తున్నారు.