100 శాతం ఆర్గానిక్ బ్యాగ్ లెస్ టీ బ్యాగ్స్…!

-

రోజు రోజుకీ కొత్త కొత్త వాటిని మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు వచ్చిన ఈ కొత్త రకం టీ బ్యాగ్ ని చూశారంటే అవాక్ అవ్వల్సిందే. అస్సాం కి చెందిన ఒక వ్యక్తి దీన్ని తీసుకు వచ్చారు. నిజంగా సరి కొత్తగా రూపొందించిన ఈ టీ బ్యాగ్ అందర్నీ ఆశ్చర్య పరుస్తూ వుంది. అయితే ఈ బ్యాగ్ కాగితంతో తయారు చేశారు అని అనుకుంటే పప్పులో కాలేసినట్లే..!

కేవలం ఆకుల్ని, మొగ్గల్ని ఉపయోగించి మంచి సువాసన వచ్చే టీ బ్యాగ్ ని తయారు చేశారు. దీనిని వేడి నీళ్లలో వేయగానే అచ్చం టీ బ్యాగ్ లానే మంచి రుచి, రంగు ఇస్తుంది. అయితే మరి అసలు ఎవరు తయారు చేశారు..?, నిజంగా టీ అవుతుందా అనే విషయాలను కూడా చూద్దాం..!

ఈ టీ బ్యాగ్ ని ఆకులతో, మొగ్గల తో తయారు చేశారు. దీనిని వేడి నీళ్లలో వేయగానే మంచి అరోమా వస్తుంది. నిజంగా ఈ ఐడియా వచ్చినందుకు మెచ్చుకునే తీరాలి. శివసాగర్ కి చెందిన ఆర్గానిక్ ఆర్గానిక్ టీ రైతు దీనిని తీసుకు వచ్చారు.

పైగా ఈ టీ చాలా స్మూత్ గా మరియు రిఫ్రెషింగ్ గా ఉంది. దీన్ని రూపొందించడానికి కొన్ని టెక్నిక్స్ ను కూడా ఉపయోగించారు. ఇందులో వీళ్ళు టీ ఆకుల్ని, మొగ్గల్ని వాడి ఇలా 100% నేచురల్ మరియు శుద్ధమైన దారాలతో స్టార్ట్ చేసారు. నిజంగా ఈ క్రేయేషన్ కి ప్రశంసలు ఇచ్చి తీరాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version