ఇప్పటి కాలంలో అసలు వయసుతో సంబంధం లేకుండా చాలా మందియువకులకు, చిన్న పిల్లలకు గుండెపోటు ఎలా వస్తుందో తెలిసిందే. మంచి బలమైన ఎందరో వ్యక్తులు కూడా ఈ గుండెపోటుకు గురికావడం ఈరోజుల్లో చాల సహజంగా మారడం మనం చూస్తున్నాం. మొన్న కూడా ఒక ఇంటర్ విద్యార్ధిని పరీక్ష రాస్తుండగా గుండెపోటు రాగానే పడిపోగానే 108 అంబులెన్స్ సిబ్బంది సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన సంగతి తెలిసిందే. ఇలాంటి ఒక సంఘటన ఈరోజు కూడా చోటు చేసుకుంది. ఒక వ్యక్తి ఆటో డ్రైవింగ్ చేస్తుండగా డ్రైవర్ గుండెపోటుకు గురయ్యాడు. 108 అంబులెన్స్ సిబ్బంది ఆ డ్రైవర్‌కు సీపీఆర్ చేసి అతని ప్రాణాలు రక్షించారు.
వివరాల్లోకి వెళ్తే, సిద్దిపేట జిల్లాలోని కొండపాక నుంచి కుక్కునూరుపల్లికి ఓ యువకుడు ఆటో నడుపుతూ బయల్దేరాడు. దారి మధ్యలోనే ఆటోను ఆపి డ్రైవర్ కిందపడిపోయాడు. అక్కడే ఉన్న ఓక స్థానికుడు చూసి, వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించాడు. క్షణాల్లోనే ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది.. ఆటో డ్రైవర్‌కు సీపీఆర్ చేశారు. సీపీఆర్ చేయడంతో బాధిత వ్యక్తి ప్రాణాలతో బయటపడ్డాడు. ఆటో డ్రైవర్‌ను పర్వతం రాజు గా గుర్తించారు. అనంతరం రాజును గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు.