నేటి నుంచి పదో తరగతి పరీక్షలు.. ఎక్కడంటే..?

-

క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభ‌ణ నేప‌థ్యంలో దేశ‌వ్యాప్తంగా విద్యాసంస్థ‌ల‌న్నీ స్తంభించిపోయాయి. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పదో త‌ర‌గ‌తి పరీక్షలు ర‌ద్ద‌య్యాయి. కరోనా వ్యాప్తి నేపధ్యంలో కర్ణాటకలో కూడా పదో తరగతి పరీక్షలు రద్దు చేయాలన్న డిమాండ్ వచ్చినా, యడియూరప్ప సర్కారు పరీక్షలు జరిపించేందుకే నిశ్చయించింది. దీంతో రాష్ట్రంలో గురువారం నుంచి పది ప‌రీక్ష‌లు జ‌రుగుతాయ‌ని క‌ర్ణాట‌క ఆరోగ్య‌శాఖ మంత్రి బీ శ్రీరాములు తెలిపారు.

ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోసం విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింద‌ని ఆయ‌న చెప్పారు. ప‌రీక్ష‌లకు హాజ‌ర‌య్యే విద్యార్థులు త‌ప్ప‌నిస‌రిగా ముఖాల‌కు మాస్కులు ధ‌రించాల‌ని, సామాజిక దూరం పాటించాల‌ని సూచించారు. దాదాపు 8 లక్షల మంది విద్యార్థులు కరోనా నిబంధనలను పాటిస్తూ పరీక్షకు హాజరు కానున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 10 వేలు దాటగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news