కోకాపేటలో ఆల్‌టైం రికార్డ్‌.. 10వ నెంబ‌ర్ ప్లాట్‌లో ఎక‌రం 100 కోట్ల

-

కోకాపేటలో ప్రభుత్వ భూముల వేలం బంగారు గనులను తలపిస్తోంది. కోకా పేట భూములు కేకపుట్టిస్తున్నాయి. నియో పోలిస్ రెండో విడత భూముల వేలం తెలంగాణ సర్కార్‌కు కాసుల పంట పండిస్తోంది. ఇవ్వాల (గురువారం) హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో కోకాపేట భూముల వేలం కొనసాగుతోంది. 10వ నెంబర్​ ప్లాట్​కి సంబంధించిన వేలంలో ఎకరా 100 కోట్ల మార్క్​ని టచ్​చేసింది. ఇప్పటివరకైతే ఇదే ఆల్​టైమ్​ రికార్డు ధరగా నమోదయినట్టు తెలుస్తోంది.

10వ నెంబ‌ర్ ప్లాట్‌లో 3.60 ఎక‌రాల భూమి ఉంది. 11వ నెంబ‌ర్ ప్లాట్‌లో 7.53 ఎక‌రాలు, 14వ నెంబ‌ర్ ప్లాట్‌లో 7.34 ఎక‌రాలు ఉంది. ఈ మూడింటికి వేలం కొన‌సాగుతోంది. ఈ భూముల వేలంలో దిగ్గ‌జ స్థిరాస్తి సంస్థ‌లు పోటీ ప‌డ్డాయి. ఎక‌రం భూమికి క‌నీస ధ‌ర రూ. 35 కోట్లుగా హెచ్ఎండీఏ నిర్ణ‌యించింది. నియో పోలిస్ ఫేజ్-2లోని 6, 7, 8, 9 ప్లాట్ల వేలం ద్వారా హెచ్ఎండీఏకు రూ. 1,532.50 కోట్ల భారీ ఆదాయం స‌మ‌కూరింది. తాజాగా నిర్వ‌హించిన వేలంతో.. ఇప్ప‌టి వ‌ర‌కు కోకాపేట నియో పోలిస్‌లో 26.86 ఎక‌రాల‌కు వేలం పూర్తయింది. గురువారం మ‌ధ్యాహ్నాం 3 గంట‌ల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు 18.47 ఎకరాల‌కు వేలం కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం నియో పోలిస్‌లో 10, 11, 14 ప్లాట్ల‌కు వేలం కొన‌సాగుతోంది. ఈ ప్లాట్ల‌కు కూడా భారీగా ధ‌ర ప‌లికే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version