తెలంగాణ‌కు 12 స్వ‌చ్ఛ అవార్డులు : కేటీఆర్

-

అర్బన్ మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా మంచినీటి సమస్య పరిష్కారం చేసుకున్నామని..గ్రీన్ బడ్జెట్ కేటాయించి హరిత పట్టణాలు గా తీర్చిదిద్దుకుంటున్నామనీ కేటీఆర్ పేర్కొన్నారు. పౌరుడు కేంద్రంగా కొత్త చట్టాలు తెచ్చామనీ.. దేశంలో శానిటేషన్ ఛాలెంజ్ పోటీలో తెలంగాణకు 12కి పైచీలుకు అవార్డులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందుకోబోతున్నామన్నారు కేటీఆర్. సఫాయి మిత్ర సురక్ష ఛాలెంజ్ అవార్డు కూడా తెలంగాణకు దక్కింది… సఫాయి మిత్ర సురక్ష కింద టాప్ 3 పట్టణాలలో కరీంనగర్ ఎంపికయ్యయిందని తెలిపారు.

గార్బేజ్ ఫ్రీ సిటీ అవార్డ్ GHMCకి దక్కింది.. ఇబ్రహీంపట్నం, సిరిసిల్ల, కోస్గి, హుస్నాబాద్, సిద్ధిపేట, కంటోన్మెంట్ తో పాటు మరో ఆరు మున్సిపాలిటీలకు అవార్డులు వచ్చాయన్నారు కేటీఆర్. కేంద్రం దగ్గర చాలా అంశాలు పెండింగులో ఉన్నాయని.. హైదరాబాద్ విషయంలో పదుల సంఖ్యలో కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉన్నాయని ఫైర్ అయ్యారు కేటీఆర్. అవార్డులు వస్తున్నాయి…అదనంగా నిధులు రావడం లేదని కేంద్రం పై మండిపడ్డారు. బెంగళూరు మెట్రోకీ నిధులు ఇస్తున్నారు… హైదరాబాద్ కి నిధులు ఇవ్వడం లేదన్నారు కేటీఆర్. 101 మున్సిపాలిటీలు ODF ప్లస్ గా గుర్తించిందని.. 8 మున్సిపాలిటీలకు ODF ప్లస్ ప్లస్ గా కేంద్రం గుర్తించిందని పేర్కొన్నారు. వాటర్ ప్లస్, స్వనిధీ పథకాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచిందన్నారు కేటీఆర్.

Read more RELATED
Recommended to you

Exit mobile version