మహారాష్ట్రలో దారుణం… ఉద్యోగం పేరుతో బాలికపై సామూహిక అత్యాచారం

-

ప్రభుత్వాలు మహిళలు, బాలికల రక్షణకు ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా.. అత్యాచారాలకు అడ్డుకట్ట పడటం లేదు. నిర్భయ, పోక్సో వంటి చట్టాలు ఉన్నా కూడా కామాంధుల్లో భయం రావడం లేదు. వావీవరసలు, చిన్నా పెద్ద తారతమ్య మరిచి జీవితాలను చిదిమేస్తున్నారు. అమాయకపు మాటలు చెప్పి అఘాయిత్యాలకు తెగబడుతున్నారు. తాజాగా మహారాష్ట్రలో ఉద్యోగం పేరుతో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు కామాంధులు.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో ఈ దారుణ ఘటన జరిగింది. ఉద్యోగం ఇప్పిస్తామని ఓ 17 ఏళ్ల బాలికనున నమ్మించి… ముగ్గరు దుర్మార్గులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ అఘాయిత్యంపై పాల్ఘర్ పోలీసులను ఆశ్రయించింది. బాలిక ఫిర్యాదు మేరకు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఒక నిందితుడితో పాటు అతనికి సమకరించిని మరో నిందితుడి భార్యను అరెస్ట్ చేశారు. మిగతా ఇద్దరు నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారు. వీరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news