తెలంగాణలో 16,940 ఉద్యోగాలు..!

-

మీరు ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. తెలంగాణలో నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ని తీసుకు వచ్చింది. ఇప్పటికే టీఎస్పీఎస్సీ వరుస నోటిఫికేషన్లు తీసుకు వచ్చింది. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ని తీసుకు వచ్చింది. నాలుగు రోజుల క్రితమే 9,168 గ్రూప్‌-4 పోస్టులని భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ని తీసుకు వచ్చింది.

ఇప్పుడు 16, 940 ఉద్యోగాలను సర్కారు తీసుకు రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. 60 వేల 929 పోస్టులని ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మరో 16 వేల 940 పోస్టులకు అనుమతి ఇచ్చేలా వున్నారు.

అలానే ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ చూస్తోంది. ఉద్యోగాలని ఇచ్చేనందుకే 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అలానే ప్రిలిమినరీ పరీక్షలను కూడా నిర్వహించింది.

ఇదిలా ఉండగా డిసెంబర్ 8 నుంచి దేహదారుఢ్య పరీక్షలు ఉంటాయి. కేవలం ఇవే కాకుండా డిసెంబర్‌ లో మరో మూడు కీలక ప్రకటనలు చేస్తున్నట్టు తెలుస్తోంది. వాటి కోసం చూస్తే… ఇందులో గ్రూప్‌-2, 3, 4 నోటిఫికేషన్లుని సర్కార్ జారీ చేస్తునట్టు తెలుస్తోంది. గ్రూప్‌-2, 3, 4కి ఆర్థికశాఖ ఇప్పటికే అనుమతి ఇచ్చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version