గుడ్‌న్యూస్‌.. దేశంలో 18 కోట్ల మంది కరోనాకు నిరోధ‌క‌త క‌లిగి ఉన్నారు..!

-

క‌రోనాతో దేశ‌వ్యాప్తంగా ఉన్న ప్ర‌జ‌లు భయాందోళ‌న‌ల‌కు గుర‌వుతున్న వేళ ఓ ఆస‌క్తిక‌ర విష‌యం వెలుగులోకి వచ్చింది. దేశ‌వ్యాప్తంగా సుమారుగా 18 కోట్ల మంది ప్ర‌జ‌లు క‌రోనాకు నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉన్నార‌ని వెల్ల‌డైంది. అంటే వీరు క‌రోనాను ఎదుర్కొనే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉన్నార‌న్న‌మాట‌. ఈ విష‌యాన్ని డాక్ట‌ర్ అరోకియా స్వామి వెలుమ‌ణి వెల్ల‌డించారు. ఈయ‌న థైరోకేర్ అనే ప్ర‌ముఖ డ‌యాగ్న‌స్టిక్స్ అండ్ ల్యాబ్స్ కంపెనీ ఎండీగా ఉన్నారు. థైరోకేర్ ద్వారా చేపట్టిన ఓ అధ్య‌య‌నంలో ఈ వివ‌రాలు తెలిశాయ‌ని ఆయ‌న వెల్ల‌డించారు.

18 crores of people in india have the immunity to corona virus

దేశ‌వ్యాప్తంగా మొత్తం 53వేల యాంటీ బాడీ టెస్టింగ్‌లు జ‌రిపామ‌ని, త‌ద్వారా వ‌చ్చిన స‌మాచారాన్ని విశ్లేషించామ‌ని డాక్ట‌ర్ అరోకియా స్వామి వెలుమ‌ణి తెలిపారు. 200కు పైగా కేసుల్లో 15 శాతం యాండీ బాడీలు పాజిటివ్ ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. అందువ‌ల్ల దేశంలో సుమారుగా 18 కోట్ల మంది క‌రోనా ప‌ట్ల నిరోధ‌క‌త‌ను క‌లిగి ఉన్న‌ట్లేన‌ని, వారు కరోనాను ఎదుర్కొనే సామ‌ర్థ్యాన్ని క‌లిగి ఉన్నార‌ని అన్నారు.

కాగా ఇవే వివ‌రాల‌ను డాక్ట‌ర్ అరోకియా ఓ ట్వీట్ ద్వారా తెలిపారు. దేశంలో కొంత శాతం వ‌ర‌కు ప్ర‌జ‌లు క‌రోనాకు ఇమ్యూనిటీని క‌లిగి ఉండ‌డం నిజంగా ఓ మంచి వార్తేన‌ని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news