ఆంధ్ర ప్రదేశ్ లోని ఇంటర్ విద్యార్థులకు జగన్ సర్కార్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. ఆంధ్ర ప్రదేశ్ ఇంటర్ పరీక్షల్లో ఇక నుంచి అదనపు జవాబు పత్రాలను ఇవ్వబోరు. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు సంచలన నిర్ణయం తీసుకుంది. ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు 24 పేజీల జవాబు పత్రాన్ని ఎగ్జామినేషన్ హాళ్ల లో అందిస్తారు. విద్యార్థులు వాటిలోనే సమాధానాలు రాయాల్సి ఉంటుంది.
పరీక్షల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బోర్డు మార్గ దర్శకాలు జారీ చేసింది ఇంటర్ బోర్డు. ప్రశ్నా పత్రాల కోడ్ లను ఏ రోజు కా రోజు విడుదల చేస్తారు. ఉదయం 8.45 నిమిషాల తర్వాత పరీక్ష హాల్ లోకి అనుమతించరు. అలాగే మొదటి 45 నిమిషాల వరకు విద్యార్థులను టాయిలెట్లకు కూడా అనుమతించబోరు. మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఇతర వస్తువులు ఏవీ కూడా పరీక్ష గదిలోకి తీసుకోని పోకూడదు. ఈ మేరకు ఇంటర్ బోర్డు కీలక ఉత్తర్వులు జారీ చేసింది.