చైనాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. గుయిజ్ ప్రావిన్స్ లో బుల్లెట్ ట్రైన్ పట్టాలు అదుపు తప్పింది. రెండు కోచ్‌లు పెను ప్రమాదానికి గురయ్యాయి. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందగా.. మరో ఏడుగురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ మేరకు చైనా స్థానిక మీడియా సంస్థ గ్లోబల్ టైమ్స్ శనివారం ట్విట్టర్ వేదికగా వివరాలు వెల్లడించింది.
పూర్తి వివరాల ప్రకారం.. చైనాలోని నైరుతి ప్రావిన్స్ గుయాంగ్ నుంచి దక్షిణ ప్రావిన్స్ గ్వాంగ్‌జౌ వైపు బుల్లెట్ ట్రైన్ నడుస్తోంది. శనివారం ఉదయం 10:30 గంటలకు గుయిజ్‌లోని ఒక స్టేషన్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో బుల్లెట్ ట్రైన్ పట్టాలు తప్పింది. రైలులోని ఏడు, ఎనిమిదవ కోచ్‌లు పట్టాలు అదుపు తప్పాయి. ట్రైన్ ఇంజిన్ పూర్తిగా ధ్వంసం అయింది. డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు విడవగా.. ఏడుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ మేరకు ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. 136 మంది ప్రయాణికులను రక్షించి, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.