టీఆర్ఎస్‌కు 40 సీట్లే..వారితో డౌటే?

-

ఏదో చావు తప్పి కన్ను లొట్టబోయినట్లు టీఆర్ఎస్ పార్టీ మునుగోడు ఉపఎన్నికలో గెలిచింది గాని..గెలిచిన జోష్ మాత్రం ఆ పార్టీలో కనిపించడం లేదు. ఇప్పటికీ బీజేపీతో ప్రమాదం తప్పదనే భయం ఆ పార్టీలో ఉంది. పైకి ఏదో కేసీఆర్…బీజేపీపై పోరాటం చేసేస్తున్నట్లు చూపిస్తున్నారు..దాని వల్ల రాష్ట్రంలో సింపతీ పొందవచ్చనే ప్లాన్. కానీ అలాంటి సింపతీలు ప్రతిసారి వర్కౌట్ కావు. పైగా ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో బీజేపీని ఇరుకున పెట్టాలని చూశారు గాని…అది కూడా వర్కౌట్ కావడం లేదు.

రోజురోజుకూ బీజేపీతో ప్రమాదం పెరుగుతుంది. ఇక సొంత పార్టీ ఎమ్మెల్యేలపై కూడా కేసీఆర్ కాన్ఫిడెన్స్ లేకుండా పోయింది..అందుకే వారు ఎటు పోకుండా, సిట్టింగులకే సీటు అని ప్రకటించారు. ఇలా చెప్పడం వల్ల కొందరు ఎమ్మెల్యేలు జంప్ కాకుండా ఆగుతారనేది కేసీఆర్ నమ్మకం. అయితే సీటు ఆశిస్తున్న నేతలు…సిట్టింగులకే సీటు అనడంతో వారు తమ దారి తాము చూసుకోవడానికి రెడీ అవుతున్నారు.

ఇక సిట్టింగులందరికి సీట్లు ఇస్తే టీఆర్ఎస్ పార్టీకే పెద్ద డ్యామేజ్ అవుతుందని సర్వేలు చెబుతున్నాయి. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వారిలో దాదాపు 50 మందికి మళ్ళీ గెలుపు అవకాశాలు శూన్యమని తెలుస్తోంది. అసలు టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా 40 మంది ఎమ్మెల్యేలని గెలుచుకోగలదని, ఇంకో 30 సీట్లలో కాస్త కష్టపడితే గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని తేలిందట. మిగిలిన సీట్లలో గెలుపు డౌటే అని సర్వేల్లో తెలినట్లు సమాచారం.

అంటే టీఆర్ఎస్ పార్టీకి అంతా అనుకూలమైన వాతావరణం కనిపించడం లేదు. కాకపోతే బీజేపీ-కాంగ్రెస్ పార్టీల మధ్య ఓట్లు చీలిపోయి తమకు లబ్ది జరుగుతుందనే స్ట్రాటజీలో కేసీఆర్ ఉన్నారు. అయితే టీఆర్ఎస్ వ్యతిరేకులు అంతా ఒక పార్టీ వైపే మొగ్గు చూపితే టీఆర్ఎస్ పార్టీకే రిస్క్ కనిపిస్తోంది. అది కూడా బీజేపీ వైపే వెళ్ళేలా ఉన్నాయి. అందుకే కేసీఆర్..బీజేపీనే టార్గెట్ చేస్తున్నారు. మొత్తానికి టీఆర్ఎస్ పార్టీకి మళ్ళీ గెలవడం అంత ఈజీ కాదు.

ReplyForward

Read more RELATED
Recommended to you

Exit mobile version