సూపర్ స్కీమ్… నెలకు రూ.5,000 పెన్షన్..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీములని తీసుకు వస్తోంది. కేంద్ర ప్రభుత్వం స్కీమ్స్ తో చాలా మంది బెనిఫిట్స్ ని పొందుతున్నారు. పౌరుల కోసం అనేక పథకాలను తీసుకు వచ్చింది. అయితే పెన్షన్ ని తీసుకోవాలనుకుంటే ఈ స్కీమ్ బాగా ఉంటుంది. మంచి పాపులర్ స్కీమ్ ఇది. ఇప్పటి వరకు ఈ స్కీమ్‌లో 52 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఇందులో చేరారు. అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ఇది. వృద్ధాప్యంలో ఈ స్కీమ్ ద్వారా రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ ఇస్తుంది.

అదే వృద్ధాప్యంలో కేంద్ర ప్రభుత్వం రూ.1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2015 మే 9న అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ని స్టార్ట్ చేసింది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఈ స్కీమ్ ని నిర్వహిస్తోంది. ఈ పథకంలో ఎవరైనా చేరొచ్చు. ఆదాయపు పన్ను చెల్లించేవారికి ఈ స్కీమ్ వర్తించదు. కనీస వయస్సు 18 ఏళ్లు ఉండాలి.

గరిష్ట వయస్సు 40 ఏళ్లు. దీనిలో ఎవరైనా ముందుగా చేరితే ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. రూ.5,000 పెన్షన్ ని పొందాలంటే 18 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.210 జమ చెయ్యాలి. 40 ఏళ్ల వయస్సులో ఈ పథకంలో చేరితే రూ.5,000 పెన్షన్ కోసం నెలకు రూ.1454 చొప్పున జమ చెయ్యాల్సి వుంది. 60 ఏళ్ల వయస్సు నుంచి ఇలా డబ్బులని కడుతూ ఉంటే.. ప్రతీ నెలా రూ. 1,000 నుంచి రూ.5,000 మధ్య పెన్షన్ లభిస్తుంది. ఒకవేళ కనుక లబ్ధిదారులు మరణిస్తే వారి జీవిత భాగస్వామికి పెన్షన్ వస్తుంది.

ఒకవేళ కనుక భార్యాభర్తలు ఇద్దరూ మరణిస్తే జమ చేసిన మొత్తం నామినీకి లభిస్తుంది. ఈ పథకంలో చేరిన తర్వాత ప్రతీ నెలా డబ్బులు కడుతూ ఉండాలి. కట్టడం ఆలస్యం అయ్యిందట పెనాల్టీ ఛార్జీలు చెల్లించాలి. జమ చేసే మొత్తాన్ని బట్టి ఈ జరిమానా రూ.10 వరకు ఉంటుంది. 6 నెలల పాటు డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ ఫ్రీజ్ అయిపోతుంది. అదే 12 నెలల పాటు డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ డీయాక్టివేట్ అవుతుంది. 24 నెలల అయినా కూడా డబ్బులు జమ చేయకపోతే అకౌంట్ క్లోజ్ అయిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news