ఎడిట్ నోట్: జగన్ ‘బొమ్మ’.!

జగన్ బొమ్మ.. రానున్న ఎన్నికల్లో వైసీపీ విజయం ఆధారపడి ఉంది..జగన్ బొమ్మ పైనే. ఆయన బొమ్మ చూస్తే జనం ఓట్లు వేసే పరిస్తితి ఉంది. అలా కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలని చూసి ఓట్లు వేసే పరిస్తితి చాలా తక్కువ ఉంది. వాస్తవానికి గత ఎన్నికల్లో కూడా జగన్ బొమ్మ వల్లే వైసీపీకి భారీ విజయం అందింది. కొంతమంది ఎమ్మెల్యేలు తమ సొంత బలం ప్లస్, పార్టీ బలంతో గెలిచి ఉంటారు..కానీ కొందరు జగన్ ఇమేజ్ వల్లే గెలిచారు. అసలు ప్రజలకు పెద్దగా పరిచయం లేని వారు కూడా గెలిచేశారంటే..అది జగన్ బొమ్మ ఎఫెక్ట్ అని చెప్పవచ్చు.

అయితే ఈ సారి ఎన్నికలు కూడా జగన్ బొమ్మపై ఆధారపడి జరగనున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత కనిపిస్తుంది. అందులో కొందరిని మార్చాలని జగన్ చూస్తున్నారు. కానీ అభ్యర్ధి ఎవరైనా సరే..ప్రజలు జగన్ని చూసే ఓటు వేయాలి. అలా కాకుండా ఎమ్మెల్యే అభ్యర్ధులని చూస్తే వైసీపీకే రిస్క్ అవుతుంది. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది గాని..జగన్ పై వ్యతిరేకత లేదు.

Jagan

పైగా సంక్షేమ పథకాలు జగన్‌కు పెద్ద ప్లస్. ప్రతి పథకం జనంలోకి వెళ్లిపోయింది. పథకం కింద డబ్బులు ఎవరు ఇస్తున్నారంటే జగన్‌ అని జనం అంటున్నారు. జగనన్న తమకు డబ్బులు వేస్తున్నారని చెబుతున్నారు. అంటే ఏం చేసిన అది జగన్ చేశారని జనం భావిస్తున్నారు. అంటే అంతలా జగన్ జనంలోకి వెళ్లారు.

ఇక నెక్స్ట్ కూడా ఈ పథకాలు కొనసాగాలంటే ఖచ్చితంగా జగన్‌కే మద్దతు ఇవ్వాలి..మళ్ళీ ఆయన్నే గెలిపించుకోవాలని జనం భావిస్తున్నారు. ఆయనని ఓడించడానికి ప్రత్యర్ధులైన చంద్రబాబు, పవన్ ఏకం అవుతున్నారు. అయితే గతంలో బాబు పాలన ఎలా ఉందో జనం చూశారు. దాని కంటే జగన్ బాగా పాలన చేస్తున్నారని, పథకాలకు డబ్బులు ఇచ్చి ఆదుకుంటున్నారని, కాబట్టి ఈ సారి కూడా జగన్‌కే ఓటు వేయాలని జనం భావిస్తున్నారు. ఇక జగన్ బొమ్మ మళ్ళీ ఎన్నికల ఫలితాలని డిసైడ్ చేయనుంది.