మీరు ఏదైనా ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకు గుడ్ న్యూస్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేటగిరీ 3 కింద నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇస్తోంది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా మొత్తం 5043 పోస్టులని భర్తీ చేయనున్నారు.
ఇక దీని కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేటగిరీ 3 కింద నాన్-ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేసేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ సెప్టెంబరు 06, 2022 నుండి మొదలు కానుంది. దరఖాస్తు పంపేందుకు చివరి తేదీ అక్టోబర్ 05, 2022.
పోస్టుల వివరాలని చూస్తే.. నార్త్ జోన్ : 2388 పోస్టులు, సౌత్ జోన్ : 989 పోస్టులు, ఈస్ట్ జోన్: 768 పోస్టులు, వెస్ట్ జోన్ : 713 పోస్టులు, NE జోన్: 185 పోస్టులు, FCI కేటగిరీ 3 అర్హతలు. పరీక్షకి పది రోజుల ముందు అడ్మిట్ కార్డు వస్తుంది.
అర్హతల వివరాలను చూస్తే సివిల్ ఇంజినీరింగ్ లో డిగ్రీ లేదా సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా తో పాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ లేదా మెకానికల్ ఇంజనీరింగ్ లో డిగ్రీ ఉండాలి. లేదా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లో డిప్లొమాతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. లేదు అంటే మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమాతో పాటు ఏడాది అనుభవం ఉండాలి. ఇలా అర్హత ఉంటే ఈ పోస్టులకి అప్లై చెయ్యచ్చు. పూర్తి వివరాలను https://www.fci.gov.in లో చూడచ్చు.