తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. అయిత ఇటీవలే ఐదో విడుత పల్లెప్రగతి కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఈ కార్యక్రమం విజయవంతమైందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పేర్కొన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభ నిర్వహించి పల్లె ప్రగతి ప్రణాళిక తయారుచేసుకున్నారని చెప్పారు. 16 రోజుల కార్యక్రమంలో గ్రామంలోని అన్ని రోడ్లు, మురుగు నీటి కాలువలను శుభ్రం చేసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని 80, 545 ప్రభుత్వ, ప్రజోపయోగ కార్యాలయాలను శుభ్రం చేసుకున్నట్లు వెల్లడించారు. రోడ్ల కిరువైపులా 10,844 కిలో మీటర్ల అవెన్యూ ప్లాంటేషన్ చేపట్టేందుకు అనువైన స్థలాన్ని గుర్తించామన్నారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. పల్లె ప్రగతి ఐదో విడత కార్యక్రమంలో 6 లక్షల 39 వేల 822 మంది ప్రజలు శ్రమదానంలో పాల్గొన్నారని పేర్కొన్న
మంత్రి.. 18 ,718 లోతట్టు ప్రాంతాలను గుర్తించి, నీటి నిల్వ ఉండకుండా మట్టితో పూడ్చామన్నారు. 23, 150 ఇంకుడు గుంతలు, 4,239 సామూహిక ఇంకుడు గుంతలను ఈ కార్యక్రమం భాగంగా లో పూర్తి చేసినట్లు వివరించారు ఎర్రబెల్లి దయాకర్‌రావు. విద్యుత్ శాఖ సిబ్బంది ఒక్క రోజు పవర్ హాలిడే కార్యక్రమంలో భాగంగా ప్రజా సమస్యలను పరిష్కరించడంతోపాటు 19, 674 స్థంబాలకు లైన్ ఏర్పాటు చేశారని వివరించారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.
అలాగే, పూర్తయిన వైకుంఠధామాలకు 1,410 విద్యుత్ కనెక్షన్లు, 1,773 వైకుంఠధామాల్లో నీటి సౌకర్యం, 1,010 వైకుంఠధామాల్లో సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర
మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసన సభ సభ్యులకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు. పల్లె ప్రగతి విజయవంతం అయ్యేందుకు అహర్నిశలు కృషి చేసిన పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ కమిషనర్, జిల్లా పరిషత్ చైర్మన్లు, కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, అన్ని ప్రభుత్వ శాఖల రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల, గ్రామ స్థాయి అధికారులు, ఉద్యోగులు, జిల్లా, మండల పరిషత్ ప్రాదేశిక సభ్యులు, ఎంపీటీసీలు, సర్పంచులు, ఉప సర్పంచులు, ప్రజా ప్రతినిధులకు అభినందనలు తెలిపారు ఎర్రబెల్లి దయాకర్‌రావు.