బాసర విద్యార్థుల కీలక నిర్ణయం.. ఇక నుంచి ఉధృతం..

-

బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను పరిష్కారించాలని కోరుతూ గత 5 రోజులుగా విద్యార్థులు నిరసనలు వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బాసర ట్రిపుల్‌ ఐటీకి వీసీని కూడా ప్రభుత్వం నియమించింది. అయినప్పటికీ విద్యార్థులు నేరుగా సీఏం కేసీఆర్‌ గానీ మంత్రి కేటీఆర్‌ గానీ వచ్చి సమస్యలను పరిష్కారించాలని డిమాండ్‌ చేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలోనే విద్యార్థుల కీలక నిర్ణయం తీసుకున్నారు. 24 గంటల నిరసన దీక్షకు పిలుపు నిచ్చారు. రాత్రంతా బయటే ఉండి నిరసనను తెలియజేయాలని నిర్ణయించారు. వర్షం కురుస్తున్నా లెక్క చేయకుండా బయటే ఉండి ఆందోళన చేస్తున్నారు.

Basara IIIT Water Cut : బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు తాగునీరు కట్..!

తమ 12 డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. రాత్రంతా బయటే ఉండి తమ నిరసనను తెలియజేయాలన్న నిర్ణయానికి వచ్చారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆరు రోజుల నుంచి దీక్ష చేస్తున్నారు. ఐదు రోజుల నుంచి ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ నిరసన తెలియజేసేవారు. కానీ ఈరోజు రాత్రంతా నిరసన దీక్ష చేయాలని నిర్ణయించామని విద్యార్థులు చెబుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news