తెలంగాణ విద్యాశాఖలో 704 ఉద్యోగాలు రెఢీ… !

-

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో నిజంగా చెప్పాలంటే అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఈ రాష్ట్రంలో అన్ని రంగాలలో తెలంగాణ పైచేయి సాధిస్తూ ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది అని చెప్పాలి. తాజాగా విద్యాశాఖలో అవకాశం ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడానికి చర్యలను చేపట్టింది. తెలుస్తున్న సమాచారం ప్రకారం విద్యాశాఖలో కాంట్రాక్టు 704 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఖాళీగా ఉన్న వాటిలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ , సైసైటెమ్ అనలిస్ట్ లు మరియు అసిస్టెంట్ ప్రోగ్రామర్లు ఉన్నాయి. వాస్తవంగా ఈ ఉద్యోగాలకు గత సంవత్సరాల ముందుగానే పోటీ పరీక్ష జరిగింది. కానీ కొన్ని కారణాల వలన పోస్ట్ లకు ఆయా వ్యక్తులను అలాట్ చేయడంలో జాప్యం జరిగింది.

ఇప్పుడు ప్రభుత్వం నుండి ఈ ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో నియామకాలను వెంటనే చెయ్యాలని విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. జులై 3న పేరిట లిస్ట్ ను మరియు జులై 10వ తేదీన నియామక పాత్రలను అభ్యర్థులకు అందచేయనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news