కాళేశ్వరం 85 గేట్లు ఎత్తివేత.. ఆ గ్రామాలు అతలాకుతలం

-

గత ఆరు రోజులుగా ఎడతెరిపి లేకుండా తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే తెలంగాణలోనే కాకుండా ఎగువన కూడా భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తుతోంది. అయితే.. కుండపోత వర్షాలకు ఉగ్రరూపం దాల్చింది గోదావరి. వరద నీరు భారీగా చేరడంతో కాళేశ్వరం ప్రాజెక్టులోని 85 గేట్లు ఒకేసారి ఎత్తారు అధికారులు. అయితే.. దీంతో ములుగు జిల్లాలోని గ్రామాలు అతలాకుతలమతున్నాయి. రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద నీటిమట్టం 16.730 మీటర్లకు
చేరడంతో.. రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు అధికారులు. నీటిమట్టం 17.360 మీటర్లకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నట్లు వెల్లడించారు అధికారులు.

గోదావరి వరద ముంపు కారణంగా వెంకటాపురం, వాజేడు, ఏటూరు నాగారం మండలాల్లోని 30కి పైగా గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకొని రాకపోకలు నిలిచిపోయాయి. పాత్రపురం, బోధపురం, వీరబాద్రారం, ఆలుబాక,తిప్పాపురం, సురవీడు, చెరుకూరు, పేరూరు, ధర్మారం గ్రామాలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు తెగిపోవడంతో.. అక్కడి జనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అంతేకాకుండా.. భద్రాచలం వెంకటాపురం ప్రధాన రహదారిపైకి గోదావరి వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోవడంతో పాటు.. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఏజెన్సీ గ్రామాలు అంధకారమయంగా మారాయి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version