పదో తరగతి పరీక్షల్లో 90 శాతం ఉత్తీర్ణత.. బాలికలదే హవా..

-

తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి నేడు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో ఉద‌యం 11:30 గంట‌ల‌కు టెన్త్ ఫ‌లితాల‌ను విడుద‌ల చేశారు మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి. రెగ్యులర్ విద్యార్థులు 5,03,579 మంది ప‌రీక్ష‌ల‌కు హాజ‌రు కాగా, 4,53,201 మంది ఉత్తీర్ణ‌త సాధించారు. మొత్తంగా టెన్త్ ఫ‌లితాల్లో 90 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు. ఇక ప్ర‌యివేటు విద్యార్థుల విష‌యానికి వ‌స్తే 819 మంది హాజ‌రు కాగా, 425 మంది పాస‌య్యారు. 51.89 శాతం ఉత్తీర్ణ‌త సాధించారు.  ఈ ఏడాది మే 23 నుంచి జూన్‌ 1 వరకు పది పరీ‌క్షలు నిర్వ‌హిం‌చారు. మొత్తం 5,08,143 రెగ్యు‌లర్‌ విద్యా‌ర్థు‌లకు 5,03,114 మంది ఎస్సెస్సీ పరీ‌క్షలు రాశారు.

1, 05,594 students get GPA-5 in SSC | Exam | CampusLive24.com | First  Campus Daily in Bangladesh

167 మంది ప్ర‌యివేటు విద్యా‌ర్థు‌లకు 87 మంది పరీ‌క్ష‌లకు హాజ‌ర‌య్యారు. జూన్ 28 ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులకు ఆగస్టు 1వ తేదిన సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news