మిస్ యూనివర్స్ కీరిటాన్ని సొంతం చేసుకున్న 60 ఏళ్ల మహిళ

-

మిస్ యూనివర్స్ అవ్వాలంటే 16 సంవత్సరాల వయసే ఉండక్కర్లేదని ఓ మహిళ నిరూపించింది. తాజాగా, బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన అందాల పోటీల్లో ‘లా ప్లాటా’ ప్రాంతానికి చెందిన 60 అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఏకంగా మిస్ యూనివర్స్ కీరిటాన్ని సొంతం చేసుకుని రికార్డు సృష్టించింది. ఆరు పదుల వయసు వచ్చినా.. ఎక్కడ తన వయసును కనిపించకుండా కుర్రకారు హృదయాలను కొల్లగొడుతూ.. అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ చరిత్ర కెక్కింది.

విజేతగా ప్రకటించబడిన ఆమె మాట్లాడుతూ.. ‘అందాల పోటీల్లో సరికొత్త చరిత్రకు తాను ప్రాతినిధ్యం వహించడం హ్యపీగా ఉంది’ అంటూ సంతోషం వ్యక్తం చేసింది. ప్రస్తుతం అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ ఆమెకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లా విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అలెజాండ్రా మారిసా రోడ్రిగ్జ్ వృత్తిరీత్యా న్యాయవాది, పాత్రికేయురాలు కావడం విశేషం.

Read more RELATED
Recommended to you

Exit mobile version