ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి ఆది మూలపు సురేష్ కు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలి కమ్యూనికేషన్ ఇంజనీర్స్ ఫెలో గా ఆయన ఎన్నికయ్యారు. 1953లో సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ గుర్తింపుతో ఏర్పడిన ఈ సొసైటీలో సైన్స్ అండ్ టెక్నాలజీ, టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, ఐటి రంగాలకు చెందిన వారు సభ్యులుగా ఉంటారు.
ఈ సంస్థ తరఫున 1.25 లక్షల మందికి పైగా నిపుణులు దేశ, విదేశాల్లో 63 కేంద్రాల ద్వారా సేవలు అందిస్తున్నారు. మంత్రి సురేష్ ను ఐఈటిఈ సొసైటీ విజయవాడ కేంద్రం నిర్వహించే కార్యకలాపాల్లో పాల్గొనాలని ఆ సంస్థ కోరింది. ఇది ఇలా ఉండగా, అభివృద్ధి వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వం దేనికైనా సిద్ధమని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వికేంద్రీకరణ ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం.. అమరావతి రైతులకు గత ప్రభుత్వం కన్నా ఎక్కువ కౌలు డబ్బులు ఇస్తున్నాం.. టీడీపీ నేతలు కావాలనే వాళ్లను రెచ్చగొడుతున్నారన్నారు.