బిజినెస్ ఐడియా: తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం..వాట్ ఏ ఐడియా..

-

ఉద్యోగం చేయడం చాలా మందికి కష్టంగా ఉంటుంది.. ఎంత కష్టపడిన కూడా జీతం చాలదు.దాంతో చాలా మంది ఉద్యోగాలు మాని సొంతంగా బిజినెస్ చేయాలని అనుకుంటారు.అలాంటి వారి కోసం చక్కటి ఐడియా..ఈ ఒక్క ఐడియా మీ జీవితాన్నే మారుస్తుంది.అసలు ఆ ఐడియా ఏంటి? ఎంత ఇన్వెస్ట్ చేయాలి..ఎంత లాభం ఉంటుంది..అనే విషయాల గురించి పూర్తిగా తెలుసుకుందాం..

అదే టీ షర్ట్ ప్రింటింగ్..కనీసం రూ.70వేలతోనూ టీషర్ట్ ప్రింటింగ్ వ్యాపారాన్ని మొదలుపెట్టి నెలకు రూ.30వేల నుంచి రూ.40 వేలు పొందొంచ్చు. లేదా రూ.2లక్షలతో మొదలుపెడితే లాభాలు కూడా లక్షల్లోనే ఉంటాయి..ఇప్పుడు ఎక్కువగా ఈ టీ షర్ట్ లకు డిమాండ్ భారీగా పెరిగింది.రోజు రోజుకు వీటి వినియోగం భారీగా పెరుగుతుంది.. గడిచిన రెండేళ్లుగా కరోనా పరిస్థితుల్లో వర్క్ హోం పెరిగిన తర్వాత ఉద్యోగులు చాలా మంది సాధారణ దుస్తులకంటే టీషర్టులనే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ప్రస్తుతం టీషర్టుల ప్రింటింగ్ కు డిమాండ్ వేగంగా పెరుగుతోంది. మార్కెట్ అవకాశాలను అందిపుచ్చుకుంటే మీరూ నాలుగురాళ్లు సంపాదించుకోవచ్చు.

అయితే, ఈ ప్రింటింగ్ వ్యాపారాన్ని రూ.70వేల పెట్టుబడితోనూ మొదలుపెట్టొచ్చు. దీని ద్వారా మీరు నెలకు రూ. 30,000 నుంచి 40,000 సులభంగా సంపాదించవచ్చు. టీ-షర్టు ప్రింటింగ్‌కు అవసరమైనవాటిలో ప్రింటర్, టీ-ప్రెస్, కంప్యూటర్, పేపర్, టీ-షర్టుల రూపంలో ముడి పదార్థాలు అవసరం. కొంచెం పెద్ద స్థాయిలో వ్యాపారాన్ని ప్రారంభించాలనకుంటే రూ.2లక్షల పెట్టుబడితోనూ దిగొచ్చు..చిన్న ప్రింటింగ్ మిషన్లు రోజుకు ఒకటి చొప్పున ప్రింట్ చెస్తుంది.టీషర్ట్ ప్రింటింగ్ మెషిన్ రూ.50,000 నుంచి కూడా అందుబాటులో ఉన్నాయి.

తెలుపు లేదా ఏదైనా ఒకే రంగు ప్లెయిన్ టీషర్టులు టోకున ఒకటి రూ.120కి కూడా లభిస్తుంది. దానిపై ప్రింటింగ్ ఖర్చు ఒక రూపాయ నుంచి 10 రూపాయల దాకా అవుతుంది. ప్రింటింగ్ క్వాలిటీని బట్టి రూ.30 కూడా అవుతుంది. చక్కటి డిజైన్ ప్రింటయిన టీషర్టును మార్కెట్ లో కనీసం రూ.250కి అమ్మొచ్చు. అంటే ఒక టీషర్టుపై కనీసం 50 శాతం లాభం పొందొచ్చు..ఆన్ లైన్ మార్కెటింగ్ చేయడం నేర్చుకోవడం వల్ల మంచి లాభాలను పొందవచ్చు.. ఇక ఆలస్యం ఎందుకు మీకు నచ్చితే ఈ వ్యాపారం మొదలు పెట్టండి..

Read more RELATED
Recommended to you

Latest news