సోనాక్షి బాత్ రూంలో అభిమాని…వైరల్ అవుతోన్న వీడియో…!

-

బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రఘ్న సిన్హా న‌ట‌వారసురాలిగా ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టింది సోనాక్షి సిన్హా.. ‘దబాంగ్’ చిత్రంలో హీరోయిన్‌గా హిందీ ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చింది. అనంత‌రం పలు సనిమాల్లో నటించి.. మెప్పించింది. ఈ హ‌ట్ బ్యూటీ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్. స‌మ‌యం దొరికిన‌ప్పుడ‌ల్లా సోష‌ల్ మీడియాలో త‌న అందాల‌ను ఆర‌బోస్తూ నెటిజ‌న్ల మతిని పోగొడుతుంది.

అయితే.. తాజాగా సోనాక్షికి ఓ అరుదైన సంఘటన ఎదురైంది. ది ఖత్రా ఖత్రా షోలో పాల్గొనేందుకు వెళ్లిన సోనాక్షి.. తన వ్యానిటీ వ్యాన్‌ లో ఫోన్‌ చూసుకుంటూ ఉండగా.. ఇంతలో ఓ వ్యక్తి ఆమె అభిమాని అంటూ వాష్‌ రూమ్‌ నుంచి బయటకు వచ్చాడు. ”మేడమ్‌ నేను మీకు పెద్ద అభిమానిని. మీ కోసమే రాత్రి నుంచి ఇక్కడే ఎదురు చూస్తున్నా…అంటూ సోనాక్షి అని పచ్చబొట్టు వేసుకున్న తన చేతిని చూపించాడు.

దీంతో ఆశ్చర్యపోయిన సోనాక్షి అతడితో మాట్లాడేందుకు ప్రయత్నిస్తుండగా… సదరు ఫ్యాన్‌ అక్కడ గందరగోళం సృష్టించాడు. అద్దం పై లిప్‌ స్టిక్‌ తో ఐ లవ్‌ యూ సోనా అని రాశాడు. ఇది నా రక్తంతో కూడా రాయగలను.. నన్ను పెళ్లి చేసుకో.. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. దీంతో షాక్‌ గురైన సోనాక్షి కేకలు వేయగా.. ఈ షో ప్రోమో వీడియో ముగిసింది. అయితే.. ఇదంతా ఫ్రాంక్‌ అని సోనాక్షికి తెలిసింది.

Read more RELATED
Recommended to you

Latest news