రెండు రోజుల కిందట.. ఏపీ కేబినేట్ మంత్రులు 24 మంది రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ నెల 11 వ తేదీన ఏపీ కొత్త కేబినేట్ ఏర్పాటు కానుంది. ఎవరికి.. మంత్రి పదవి వస్తుందోనని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొడాలి నాని, పెద్ది రెడ్డి, బొత్స సత్యనారాయణను కేబినేట్ నుంచి తప్పిస్తే… వైసీపీ ప్రభుత్వంలో సంక్షేభం తప్పదని హెచ్చరించారు వైసీపీ రెబల్ ఎంపీ రఘు రామ కృష్ణం రాజు.ఒక వేళ వారిని కేబినెట్ నుంచి తప్పించాల్సి వస్తే…సీఎం పదవినే ఎవరి కన్నా ఇస్తే బాగుంటుందని చురకలు అంటించారు రఘురామ.
పెద్దిరెడ్డి, కొడాలి నాని, బొత్సలను మంత్రి వర్గం నుంచి తొలగించినా.. మళ్లీ తీసుకుంటారని.. వారిని తొలగిస్తే.. వైసీపీ పార్టీ అడ్రస్ గల్లంతు అవుతుందని హెచ్చరించారు. సామాజిక న్యాయం, ఎస్సీ, బీసీలకు పదవులు అంటున్న సీఎం జగన్.. సొంత సామాజిక వర్గానికి చెందిన రవిచంద్రరెడ్డికి ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవి కట్టబెట్టారని మండిపడ్డారు.