ఏపీలో దారుణం ; తన పోలికలతో లేదని… 2 నెలల చిన్నారిని చంపేసిన తండ్రి

-

అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం పట్టణంలో దారుణం చోటు చేసుకుంది. రెండు నెలల పాపను కన్న తండ్రే పొట్టన పెట్టుకున్నాడు. పుట్టిన బిడ్డ తన పోలికలతో లేదంటూ భార్యతో గొడవ పడ్డ మళ్లి కార్జున అనే వ్యక్తి.. ఈ దారుణానికి పాల్పడ్డాడు. నిన్న రాత్రి ఇంట్లో నుంచి తన రెండు నెలల బిడ్డను తీసుకుని… పారిపోయిన తండ్రి మళ్లి ఖార్జున… చివరికి చంపేశాడు.

ఇంట్లో నుంచి తండ్రి మళ్లి ఖార్జున తీసుకుని వెళ్లిన నేపథ్యంలోనే.. తన బిడ్డను చంపేస్తాడని పోలీసులు ఫిర్యాదు చేసింది తల్లి. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు… పాప ఆచూకీ కోసం రాత్రి నుంచి గాలించారు. ఈ నేపథ్యం లో పోలీసులుకు ఓ సంచిలో నిర్జీవంగా కనిపించింది ఆ రెండు నెలల చిన్నారి. పాప నోటికీ ప్లాస్టర్‌ వేసి ఊపిరాడకుండా చేసి చంపేశాడు తండ్రి మళ్లి ఖార్జున్‌. మృతి చెందిన పాపను తల్లికి అప్పగించి… నిందితుడు మళ్లి ఖార్జున కోసం గాలిస్తున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Exit mobile version