భారత్ కు భారీ ముప్పు… చెప్పేసిన నిపుణులు

-

యుకె నుండి వచ్చిన వారిలో సగం మందికి కొత్త కరోనా వైరస్ సోకి ఉండవచ్చు అని నిపుణులు హెచ్చరించారు. జన్యు నిపుణులు ఈ మేరకు తమ అభిప్రాయం వ్యక్తం చేసారు. ఇప్పటివరకు, యుకె నుండి 20 మంది ప్రయాణికులు మన దేశంలో కరోనా బారిన పడ్డారు అని లెక్కలు వెల్లడి అయ్యాయి. ఈ కేసులు ఇప్పుడు యుకెలో చాలా ఎక్కువగా ఉన్నాయని నిపుణులు వెల్లడించారు.

ఇప్పుడు భారత్ కు వచ్చిన చాలా మంది కొత్త వేరియంట్‌ను కలిగి ఉండవచ్చు అని వారు పేర్కొంది. కొత్త వేరియంట్ లేని నగరం నుంచి వస్తే ఇబ్బంది లేదు గాని, ఉన్న నగరం నుంచి వస్తే మాత్రం ఆందోళన చెందాలని హైదరాబాద్ సెంటర్ ఆఫ్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సిసిఎంబి) డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా వెల్లడించారు. నెల క్రితం వచ్చిన వారిని పరీక్షించాల్సిన అవసరం లేదు అని ఆయన పేర్కొన్నారు.

ఒక నెల క్రితం వచ్చిన వారిని పరీక్షించడంలో అర్థం లేదు అని పేర్కొన్నారు. చాలా మందికి లక్షణాలు లేవు అని నిపుణులు వెల్లడించారు. వారు ఇతరులకు వ్యాప్తి చేసి ఉండవచ్చు అని కూడా చెప్పారు. కొత్త వేరియంట్ ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది. అనేక దేశాలు యునైటెడ్ కింగ్‌డమ్‌ తో అంతర్జాతీయ ప్రయాణాన్ని నిషేధించాయి. మంగళవారం, యుకె నుండి భారతదేశానికి వచ్చిన 20 మంది ప్రయాణికులు పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news