ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ని ఎదుర్కోవడంలో ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాల అవసరం. వ్యాక్సిన్ లేకపోతే మాత్రం కరోనా ను కట్టడి చేయడం అనేది సాధ్యం కాదు అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. కరోనా కట్టడిలో వ్యాక్సిన్ కోసం ఇప్పుడు చాలా వరకు ప్రయత్నాలు చేస్తున్నా సరే అది మాత్రం సాధ్యం కావడం లేదు. ఇక ఇప్పుడు వ్యాక్సిన్ లేకపోవడంతో ఇతర వ్యాధులకు వాడే మందులను దీనికి వాడుతున్నారు.
అమెరికా శాస్త్రవేత్తలు చెప్పిన దాని ప్రకారం టీబీ, పోలియో వ్యాక్సిన్లతో కరోనా వైరస్ బారినుంచి బయటపడవచ్చు అని అవి తాత్కాలికంగా ఉపయోగపడతాయి అని అధికారులు పేర్కొన్నారు. ఇప్పటికే అందుబాటులో ఉన్న టీబీ, పోలియో వ్యాక్సిన్లతో కరోనా నుంచి తాత్కాలిక రక్షణ పొందే అవకాశం ఉంది అని తెలుస్తుంది. టీబీ, పోలియో వ్యాక్సిన్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి అని అధికారులు పేర్కొన్నారు.
పరిశోధకులు సైంటిఫిక్ జర్నల్ లో రాశారని వాషింగ్టన్ పోస్ట్ ఒక ఆర్టికల్ ప్రచురించింది. అయితే టీబీ వ్యాక్సిన్ కరోనాను కట్టడి చేస్తుందా లేదా అనే దానిపై ఇంకా కొన్ని దేశాలకు స్పష్టత రావడం లేదు. అమెరికా, నెదర్లాండ్, ఆస్ట్రేలియా దేశాల్లో క్లినికల్ పరిక్షలు చేస్తున్నారు. ఇప్పుడు దాని ప్రకారం చూస్తే కరోనా కట్టడికి మందు లేకపోతే మాత్రం భారీగా ప్రాణ నష్టం ఎదుర్కోవాల్సి ఉంటుంది అని పలువురు హెచ్చరిస్తున్నారు.