అమెరికాలో ఆశ్చర్యకరమైన ఘటన చోటు చేసుకుంది. ప్రపంచంలోనే మొదటిసారిగా మంకీపాక్స్ సోకిన ఓ గర్భిణీకి పండంటి బిడ్డను జన్మించాడు. ఈ విషయాన్ని వైద్యులు అధికారిక ప్రకటన చేశారు. అయితే తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నట్లు వ్యాధి నియంత్రణ, నివారణ కేంద్రం (సీడీసీ అధికారులు తెలిపారు. ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోవడం చాలా అరుదని అధికారులు చెప్పారు. అయితే తల్లికి ఏదైనా వ్యాధి సంక్రమిస్తే పుట్టిన పిల్లాడికి కూడా అదే లక్షణాలు కలిగి ఉండేదన్నారు. కానీ బిడ్డకు ఆరోగ్యంగా పుట్టడం ఇదే తొలిసారి అని అధికారులు తెలిపారు.
చిన్నారికి ఇమ్యూన్ గ్లోబిన్ ఇన్ఫ్యూషన్ ఇచ్చామని సీడీసీ అధికారులు వెల్లడించారు. బిడ్డకు తల్లిపాలు ఇచ్చేందుకు అవసరమైన జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, మంకీపాక్స్ వ్యాప్తి సమయంలో రోగనిరోధకంగా ఇమ్యూన్ గ్లోబిన్‌ను యాంటీబాడీగా ఉపయోగించాలని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ఆమోదం తెలిపింది. కాగా, అమెరికాలో ఇప్పటికే ఇద్దరు చిన్నారుకు మంకీపాక్స్ సోకింది. స్పెయిన్‌లో దాదాపు 3,596 కేసులు నమోదయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించింది.