పవన్ కళ్యాణ్ తో నటించే అరుదైన అవకాశం.. దరఖాస్తులు ప్రారంభం..

-

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించాలని కోరిక ఎంతోమందికి ఉంటుంది అయితే అది అంతా తేలికైన విషయం ఏమీ కాదు కానీ తాజాగా ఈ అవకాశాన్ని కల్పించింది చిత్ర నిర్మాణ సంస్థ డివివి ఎంటర్టైన్మెంట్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించాలి అనుకునే వారికి ఒక మంచి అవకాశాన్ని అందించింది చిత్ర నిర్మాణ సంస్థ డి వి వి ఎంటర్టైన్మెంట్స్.. పవన్​ కల్యాణ్​, సాహో డైరెక్టర్​ సుజిత్​ కలయికలో ఓ సినిమా వస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ వేగంగా జరుగుతోంది.. అయితే చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్​టైనమెంట్స్​ ఈ సినిమాలో కొన్ని విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ ఒక పోస్టర్ను విడుదల చేసింది..

ప్రస్తుత పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు అలాగే మొదటిసారి పాన్ ఇండియా చిత్రం హరహర వీరమలలో నటిస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది.. అలాగే మాస్​ డైరెక్టర్​ హరీష్​ శంకర్​ దర్శకత్వంలో ‘ఉస్తాద్ భగత్​సింగ్​’లో నటిస్తున్నారు. అలాగే పవన్ కొత్త ప్రాజెక్టు సుజిత్​ డైరెక్షన్​లో తెరకెక్కుతోంది. ఇటీవలే దానికి సంబంధించిన ఓ పోస్టర్​ను కూడా రిలీజ్ చేశారు. అలాగే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్​ వర్క్​ శరవేగంగా జరుగుతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం డివివి ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా పవన్ కళ్యాణ్ తో పనిచేసే అరుదైన అవకాశాన్ని కల్పించింది..

అలాగే ఆర్ట్, ఫ్యాషన్​, ఎన్​విరాన్​మెంట్​, కాన్సెప్ట్ ఆర్టిస్ట్స్ విభాగాల్లో పనిచేసేందుకు దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికి సంభందించిన ఒక పోస్టర్ ను సైతం సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.. ఆ పోస్టర్​లో ఓ పెన్​పై జపనీస్​ భాషలో ఏవో అక్షరాలు రాసి ఉన్నాయి. ఆ పోస్టర్​ కింద ఆసక్తి కలవారు [email protected]కి దరఖాస్తులను పంపించవచ్చని తెలిపింది అలాగే ఈ సినిమా కోసం పవన్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఇది చూసిన పవన్ అభిమానులంతా ఎంతో సంబరపడిపోతున్నారు ఒక అవకాశం పవన్ కళ్యాణ్ తో నటించటనికి వచ్చినా చాలు అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

 

Read more RELATED
Recommended to you

Latest news