ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం

-

తెలంగాణతోపాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు పై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. విచారణను సిబిఐకి అప్పగించాలన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు పై అప్పీల్ కు వెళ్ళింది రాష్ట్ర ప్రభుత్వం. సీట్ దర్యాప్తును రద్దు చేస్తూ సిబిఐకి బదిలీ చేయాలని ఇటీవల సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే.

ఈ మేరకు ఆపిల్ కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ విచారణకు వెళ్లే అవకాశం ఉంది. ప్రభుత్వ ఆపిల్ పై విచారణ చేపట్టనుంది సీజే జస్టిస్ ఉజ్జల్ బుయాన్ ధర్మసనం.

Read more RELATED
Recommended to you

Latest news