సొంతగడ్డ పై పాకిస్తాన్ కు ఘోర పరాభవం.. బంగ్లాదేశ్ చారిత్రక రికార్డు..!

-

సొంతగడ్డ పై పాకిస్తాన్ జట్టుకు ఘోర పరాభవం ఎదురైంది. పసికూన బంగ్లాదేశ్ చేతిలో రెండు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ ను 0-2 తేడా చేజార్చుకుంది. పాక్ క్రికెట్ చరిత్రలోనే బంగ్లాదేశ్ చేతిలో టెస్ట్ సిరీస్ కోల్పోవడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఇవాళ ముగిసిన రెండో టెస్ట్ లో బంగ్లాదేశ్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్ లో బ్యాటింగ్ చేసిన పాకిస్తాన్ జట్టు కేవలం 274 పరుగులు మాత్రమే చేయగలిగింది.

బంగ్లాదేశ్ బౌలర్లలో మెహిది హసన్ మీరజ్ 5 వికెట్లు తీశాడు. షాన్ మసూద్ (57), సైమ్ అయూబ్ (58), అఘా సల్మాన్ (54) అర్థసెంచరీలతో రాణించారు. పాక్ మిగతా బ్యాటర్లందరూ విఫలం చెందారు. ఇక బంగ్లాదేశ్ 26 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. దాదాపు అందరూ బంగ్లా ఓడిపోతుందని భావించారు. కానీ లిటన్ దాస్ వీరోచితంగా పోరాడి సెంచరీ సాధించాడు. ఆల్ రౌండర్ మెహిద్ హసన్ మిరాజ్ (78) సహకారం అందించడంతో బంగ్లాదేశ్ 262 పరుగులు చేసింది.  రెండో ఇన్నింగ్స్ లో పాకిస్తాన్ కేవలం 172 పరుగులు మాత్రమే చేయగలిగింది.  పాక్  నిర్దేశించిన 185 పరుగుల లక్ష్యాన్ని కేవలం నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది బంగ్లాదేశ్. పాక్ పై బంగ్లాదేశ్ తొలిసారి రికార్డును నమోదు చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version