బీజేపీ కేంద్ర ప్రభుత్వం సంస్థలను ఉపయోగించి ప్రతిపక్షాలపై కక్ష సారిస్తోందని విమర్శించారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. దేశంలో ప్రతిపక్షాలను బెదిరించి, దేశ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తోందని ఆరోపించారు. ఈ దేశ ప్రజాస్వామ్య యుతంగా, రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి ప్రశ్నించే వారిపై కేసులు పెడుతోందని, దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోందని ఆరోపించారు. దేశ విభజనకు కారణం అవుతున్న బీజేపీపై పోరుకు ‘భారత్ జోడో’ యాత్ర చేస్తానని ప్రకటించిన తరువాత, బీజేపీకి దేశంలో నూకలు తీరుతాయనే భయంతోనే బీజేపీ ఈడీని ఉపయోగిస్తోందని విమర్శించారు. నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమ కేసులు బనాయించి రాహుల్ గాంధీని ఈడీ ప్రశ్నిస్తోందని భట్టి అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సంగ్రామంలో నేషనల్ హెరాల్డ్ పత్రికను స్థాపించి ప్రజలు భాగస్వామ్యం అయ్యేలా చేశారని అన్నారు. నేషనల్ హెరాల్డ్ నష్టపోతుంటే.. అందులో జర్నలిస్టులు ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ ముందుకు వచ్చి ఆదుకుందని ఆయన అన్నారు. నేషనల్ హెరాల్డ్ లో ఎటువంటి లావాదేవీలు , అక్రమాలు జరగలేదని గతంలో ఈడీ చెప్పిన మాటలను గుర్తు చేశారు. బీజేపీపై రాహుల్ గాంధీ చేస్తున్న పోరాటాన్ని ఆపడం కోసమే ఇలా చేస్తుందని విమర్శించారు.
బీజేపీ దేశంలో ప్రతిపక్షాలు లేకుండా కుట్ర చేస్తోంది: భట్టి విక్రమార్క
-