వ్యవసాయంలో మిషన్ల వినియోగంతో ఎన్ని లాభాలో తెలుసా?

-

కొంతమంది పై చదువులు చదివి ఉద్యోగాలు చేస్తున్నా సరే.. వ్యవసాయం వైపు మొగ్గు చూపుతున్న వారెందరో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఇప్పుడు డిమాండ్ ను బట్టి కూలీలు దొరకడం చాలా కష్టం. కూలీల కొరత అధికంగా ఉన్న నేపధ్యంలో ఆకొరతను పూరించేందుకు యంత్రాలు రంగప్రవేశం చేశాయి. కూలీలలో రోజుల తరబడి చేసే వ్యవసాయ పనులను యంత్రాలు గంటల వ్యవధిలోనే పూర్తిచేస్తున్నాయి..

ప్రస్తుతం మారిన టెక్నాలజీని అందిపుచ్చుకోవడంలో రైతులు ముందుంటున్నారు.వ్యవసాయానికి సాంకేతికత జోడిస్తే అద్భుత ఫలితాలు ఆవిష్కృతమవుతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ యాంత్రిక పరికరాలను అందించేందుకు ప్రభుత్వం ఏటా రైతన్నలకు సబ్సిడీలను అందిస్తోంది. వ్యవసాయంలో యాంత్రపరికరాలను ఉపయోగించటం వల్ల రైతులకు అదనపు శ్రమతో పాటు ఖర్చు తగ్గుతుంది..

ముఖ్యమైన పంట కోతలకు ఉపయోగించే యంత్రాలు..

వరి కోత యంత్రం.. ఒకప్పుడు వరిని కోతలకు పదుల సంఖ్యలో కూలీల అవసరం ఉండేది. అయితే ప్రస్తుతం కూలీలు కూడా అందుబాటులో ఉండటం లేదు. ఈ నేపథ్యంలో వరిని కోసేందుకు పలు కంపెనీలు తమ సంస్థ నుంచి యంత్రాలను అందుబాటులోకి తీసుకొచ్చాయి. వరి కోతలకు యంత్రాలను వాడుతున్నచోట కోత అనంతరం పొలంలో గడ్డి ముక్కలు ముక్కలుగా పడుతుంది. ఈ ముక్కలను గడ్డిని మోపులుగా చేసే యంత్రాలు గుండ్రంగా బేళ్లు మాదిరిగా గడ్డిని కట్టలు కడుతుంది..

చెరుకును కత్తిరించే యంత్రం.. చెరకు సాగులో యాజమాన్య చర్యలు చేపట్టటంలో కూలీలే కీలకం. కూలీల కొరతతో చెరకు రైతులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం గడను కింది వరకు కత్తిరించే యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. అవే చిన్న ముక్కలుగా చేస్తాయి వెంటనే మిల్లుకు తరలించుకోవచ్చు. దీనివల్ల సమయం ఆదా అవుతుంది. ఒక్కో యంత్రం ధర రూ. 95 లక్షల వరకు ఉంది. రైతులు సంఘంగా ఏర్పడి ప్రభుత్వం నుంచి రాయితీ ద్వారా పొందే అవకాశం ఉంది..బయట కూడా వెళ్ళడం వల్ల కూడా మంచి ఫలితాలను పొందవచ్చు..

మందుల పిచికారీ డ్రోన్లు..10 నిమిషాల వ్యవధిలోనే ఎకరం తోటలో పురుగుల మందు పిచికారి చేసే డ్రోన్లు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. ఒకేసారి 20 మీటర్ల వెడల్పులో పురుగుల మందులను పిచికారీ చేయవచ్చు. పురుగుమందు పోస్తే అదే కలుపుకుంటుంది. పిచికారీ పూర్తయిందాకా మందు, నీటిని కలుపుతూనే ఉంటుంది. ఈ యంత్రంతో సమయం ఆదాతో పాటు పురుగుల మందును పిచికారీ చేసే రైతులు అనారోగ్యాల బారిన పడే ప్రమాదం తప్పుతుంది. ప్రస్తుతం ఈ యంత్రాలు వ్యవసాయంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి..పంట కూడా మంచిగా రావడంతో చాలా మంది మిషన్లను ఉపయొగిస్తున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news